E-Paper
Advertisement

Telangana Elections 2023: గజ్వేల్‌లో కేసీఆర్‌ ఎన్నికల హామీ.. కామారెడ్డిలో అసంతృప్తి..

Telangana Elections 2023: గజ్వేల్‌లో కేసీఆర్‌ ఎన్నికల హామీ.. కామారెడ్డిలో అసంతృప్తి..

Telangana Elections 2023 : సీఎం కేసీఆర్‌ పోటీపై కామారెడ్డి ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గజ్వేల్‌లో నెలకోసారి పర్యటిస్తానని.. అక్కడి అభివృద్ధిపై ఫోకస్‌ పెడతానన్న సీఎం హామీతో కామారెడ్డి ప్రజలు ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్.. ఆ రెండు చోట్ల గెలిస్తే దేనిని వదులుకుంటారన్న ప్రశ్న తలెత్తుతున్న వేళ.. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కామారెడ్డి వాసుల్లో అసంతృప్తిని నింపింది.

ఎన్నికల వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్‌ తొలిసారి రెండు స్థానాల నుంచి బరిలో దిగనున్నారు. ఒకటి తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ కాగా.. మరొకకటి కామారెడ్డి. గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తుండటం.. అక్కడ కేసీఆర్‌పై వ్యతిరేకత ఉండటంతోనే కామారెడ్డిని కూడా ఎంచుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు ఆ వ్యూహం కేసీఆర్‌కు ప్లస్‌ అవుతుందా..? మైనస్ అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇదిలా ఉంటే.. గజ్వేల్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు. ఇందులో భాగంగానే గజ్వేల్‌కు నెలకోసారి వస్తానని హామీ ఇవ్వడంతో సీఎం కేసీఆర్‌ అక్కడే కంటిన్యూ అవుతారన్న చర్చ మొదలైంది. దీంతో కామారెడ్డి వాసులు ఆలోచనలో పడ్డారు. ఈ స్థానాన్ని వదులుకునే కేసీఆర్‌కు ఓటేయడం అవసరమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×