BigTV English

Political Alliance : కొలిక్కి రాని పొత్తుల వ్యవహారం.. బీజేపీ దారెటు ?

Political Alliance : కొలిక్కి రాని పొత్తుల వ్యవహారం.. బీజేపీ దారెటు ?

Political Alliance : ఏపీలో పొత్తుల వ్యవహారం ఇంకా తేలలేదు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. బీజేపీ దారేటు అనేదానిపై క్లారిటీ రాలేదు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నానని పవన్ గతంలో చెప్పారు. కానీ.. ఇప్పటివరకూ బీజేపీ తెల్చుకోలేదు. బీజేపీ అధ్యక్షురాలు.. పురందేశ్వరి మాత్రం.. పొత్తుల వ్యవహారం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని చెబుతూ వస్తున్నారు. అటు.. టీడీపీ, జనసేన మాత్రం ఉమ్మడి కార్యచరణకు సిద్దమవుతోంది. ఈ నెల 23న నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌ భేటీ కానున్నారు.


ఇద్దరు నేతలు రాజమహేంద్రవరంలో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ నిర్వహించే విషయమై చర్చిస్తారు. దానితో పాటు.. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. ఈ భేటీలో సీట్ల కేటాయింపుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఓ వైపు టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణకు సిద్దమవుతుంటే.. బీజేపీ మాత్రం స్పందించడం లేదు. 2014 ఎన్నికల పొత్తు రిపీట్ అవుతుందా? లేదా అనేది ఉత్కంఠగా ఉంది. జనసేన .. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తుపెట్టుకున్నారు. కాబట్టి బీజేపీ దారెటు అనేది తేలాల్సి ఉంది.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×