E-Paper
Advertisement

Telangana Elections | కాంగ్రెస్‌పై విష ప్రచారం మొదలుపెట్టిన బీఆర్ఎస్ : చామల కిరణ్ కుమార్ రెడ్డి

Telangana Elections : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం మొదలుపెట్టిందని టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Telangana Elections | కాంగ్రెస్‌పై విష ప్రచారం మొదలుపెట్టిన బీఆర్ఎస్ : చామల కిరణ్ కుమార్ రెడ్డి
Advertisement

Telangana Elections : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం మొదలుపెట్టిందని టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందని సర్వేలు చెప్పుతుండడంతో కారు పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, ఇటు జనాల్లో కూడా హస్తం పార్టీపై రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో అధికార పార్టీ కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు.

మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలన్నీ కర్ణాటకకు వెళ్లిపోతాయని, డీకే శివకుమార్‌ ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని బీఆర్ఎస్ అబద్ధాలు వ్యాప్తి చేస్తోంది. ఫేక్‌ లేఖలను సర్క్యులేట్ చేస్తూ కాంగ్రెస్‌ను దొబ్బకొట్టాలని చూస్తోంది. డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ సీఈఓకి లేఖ రాశారని, యాపిల్ ఎయిర్ పాడ్ తయారీ ప్లాంట్‌ను కంపెనీని బెంగుళూరుకు మార్చాలని కోరినట్లు కేటీఆర్‌ పదే పదే చెబుతున్నారు. అంతటితోనే ఆగకుండా త్వరలోనే తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని, అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ మార్చేస్తాం అని డీకే లేఖలో రాసినట్లు ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నమని విమర్శలు చేశారు కేటీఆర్‌. అయితే ఇదంతా డ్రామా. ఈ వార్తలపై స్పందించిన డీకే శివకుమార్ ఆ లెటర్ ఫేక్ అని స్పష్టం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫేక్‌ లెటర్‌ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేందుకు కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు,” అని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

Advertisement

కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్‌పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మార్చడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×