E-Paper
Advertisement

సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!

సిద్దిపేట గడ్డపై అమెరికా టెక్నాలజీ.. మంత్రి శ్రీదర్ బాబు కీలక ప్రకటన..!
Advertisement

Telangana Industry: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాకుండా ‘గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్’గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. తయారీ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ లోని ‘ఆజాద్ – సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్’లో గురువారం 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘ది ఎక్స్ క్లూజివ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్(Baker Hughes)’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

నేడు ప్రైవేట్ రంగంలోనూ..

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బేకర్ హ్యూస్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు. ఒకప్పుడు రక్షణ పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే నిలయమైన హైదరాబాద్.. నేడు ప్రైవేట్ రంగంలోనూ ప్రెసిషన్ ఇంజనీరింగ్‌ పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిందన్నారు. అంతేకాకుండా.. 1500కు పైగా ఎంఎస్ఎంఈలతో హై ప్రెసిషన్ మాన్యూఫ్యాక్చరింగ్‌లోనూ గ్లోబల్ హబ్ గా ఎదుగుతోందన్నారు. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, ఎయిర్‌బస్, హనీవెల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు సైతం తమ కార్యకలాపాలను విస్తరించేందుకు హైదరాబాద్ ను ఎంచుకోవడానికి ఇక్కడి ఎకో సిస్టం కారణమన్నారు. ఆ దిశగా అప్పట్లో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన బలమైన పునాదులుఇప్పుడు తెలంగాణను పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాయన్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో.. జాతీయ భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Also Read: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో..

ఆ దిశగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసి… రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ‘అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ ‘బేకర్ హ్యూస్’…ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ అండ్ ఎక్విప్ మెంట్(వోఎఫ్ఎస్ఈ), ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ టెక్నాలజీ(ఐఈటీ), టెక్నాలజీ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ తదితర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఐఈటీ విభాగానికి అవసరమైన హై ప్రెసిషన్ ఉత్పత్తులు తాజాగా ప్రారంభమైన ఈ యూనిట్ లో తయారవుతాయి. కొత్తగా 230 మందికి ఉపాధి లభిస్తుంది’ అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. కార్యక్రమంలో బేకర్ హ్యూస్ ప్రతినిధులు డేవిడ్ మర్రానీ, స్టీఫెన్ హిన్సన్, మార్సెల్లో బారియాని, రోసానో చియెల్లి, మాసిమిలియానో తుర్సీ, మౌరో బ్రాకో, విశాల్ ముర్గుడ్కర్, లియో డి ఫిలిప్పో, ఆజాద్ ఇంజనీరింగ్ ఛైర్మన్, సీఈవో రాకేష్ చోప్దార్, టీజీఐఐసీ ఎండీ శశాంక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×