E-Paper
Advertisement

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్..

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్..
Advertisement

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అందులోభాగంగా ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకురానున్నది వ్యవసాయ శాఖ. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మక అమలు చేయనుంది. రబీ ముందస్తు ప్రణాళికపై వ్యవసాయ, ఉద్యాన అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు.

యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటోంది వ్యవసాయశాఖ. యాప్ ద్వారా సమీ ప డీలర్ వద్ద యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైతులు కావాల్సిన పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు బుకింగ్ ఐడి వెళ్తుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగానే డీలర్ ద్వారా యూరియా విక్రయం జరుగుతుంది.

Advertisement

పంట పేరు, సాగు విస్తీర్ణం నమోదు చేస్తే అర్హత మేరకు యూరియా లెక్కింపు జరుగుతుంది. యూరియా దుర్వినియోగం అరికట్టడమే లక్ష్యంగా యాప్ తీసుకువస్తోంది ప్రభుత్వం. అధిక యూరియా వినియోగం వల్ల నష్టాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై కూడా అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతారు. కౌలు రైతులకు కూడా యాప్‌లో ప్రత్యేక సదుపాయం కల్పించనున్నారు.

Advertisement

 

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×