E-Paper
Advertisement

IPL 2026 Auction: రేపే మినీ వేలం..అమ‌లులోకి కొత్త రూల్, గ్రీన్‌కు రూ.30.50 కోట్లు..టైమింగ్స్‌, ఫ్రీగా చూడాలంటే

IPL 2026 Auction: రేపే మినీ వేలం..అమ‌లులోకి కొత్త రూల్, గ్రీన్‌కు రూ.30.50 కోట్లు..టైమింగ్స్‌, ఫ్రీగా చూడాలంటే
Advertisement

IPL 2026 Auction:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament ) సంబంధించిన మినీ వేలంకు ముహూర్తం ఖరారు అయింది. డిసెంబర్ 16 అంటే మంగళవారం రోజున ఈ ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. అబుదాబీ ( Abudaabi) వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ముందుగా ముంబైలో ఈ మినీ వేలం నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అబుదాబీకి షిఫ్ట్ అయింది. అబుదాబీ ( UAE) వేదికగా రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఐపిఎల్ 2026 మినీ వేలం ( IPL 2026 Auction) ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ లో ఫ్రీగానే చూడ‌వ‌చ్చు. రేపు మ‌ధ్యాహ్నం 2:30 PM ఈ వేలం ప్రారంభం కానుంది. మొత్తం 350 ప్లేయ‌ర్లు పాల్గొంటారు. ఇందులో 240 మంది దేశీయ ప్లేయ‌ర్లు కాగా, 110 విదేశీయులు.

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

రేపే మినీ వేలం..అమ‌లులోకి కొత్త రూల్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలంకు ముహూర్తం ఖరారు అయింది. డిసెంబర్ 16 అంటే మంగళవారం రోజున ఈ ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. అబుదాబీ వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ముందుగా ముంబైలో ఈ మినీ వేలం నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని అనివార్య కారణాలవల్ల అబుదాబీకి షిఫ్ట్ అయింది. అబుదాబీ వేదికగా రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఐపిఎల్ 2026 మినీ వేలం ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం రేపు అబుదాబీ వేదికగా జరగనున్న నేపథ్యంలో తెరపైకి కొత్త రూల్ తీసుకువచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐపీఎల్ మినీ వేలంలో విదేశీ ప్లేయర్ల అత్యధిక ధర కేవలం రూ.18 కోట్లుగా నిర్ణయించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

ఒక విదేశీ ప్లేయర్ రూ.18 కోట్ల కంటే ఎక్కువ ధర పలికినప్పటికీ, అతనికి రూ.18 కోట్లు మాత్రమే ఇవ్వాలి. ఆ ఎక్కువ వచ్చిన ధరను ప్లేయర్ల వెల్ఫేర్ కోసం మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్ ( Cameron Green)కు రూ. 20 కోట్లు వచ్చాయి అనుకుంటే, అందులో అతనికి రూ.18 కోట్లు మాత్రమే ఇవ్వాలి. మిగిలిన రెండు కోట్లు ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఉపయోగించనుంది ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఈ కొత్త రూల్ తీసుకురావడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. విదేశీ ప్లేయర్లకు రూ.20 కోట్లు ఇస్తున్న నేపథ్యంలో వాళ్లు పూర్తిస్థాయి టోర్నమెంట్ ఆడడం లేదు. ఐదు లేదా ఆరు మ్యాచ్ లు ఆడి, మధ్యలోనే తమ దేశం కోసం మ్యాచ్ లు ఆడాలని వెళ్ళిపోతున్నారు. కొంద‌రైతే వేలంలో అమ్ముడుపోయాక‌, అస‌లు ఇండియాకు రాకుండానే టోర్న‌మెంట్ నుంచి త‌ప్పుకుంటున్నారు. దానివల్ల ఫ్రాంచైజీలకు నష్టం వాటిల్లుతోంది. అందుకే ఫ్రాంచైజీలు నష్టపోకుండా ఐపిఎల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది.

కామెరాన్ గ్రీన్ కు రూ.30.50 కోట్లు

Advertisement

ఐపీఎల్ 2026 మినీ వేలం రేపు జరగనున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఐపీఎల్ మాక్ వేలం నిర్వహించింది. ఇందులో కామెరాన్ గ్రీన్ కు రూ. 30.50 కోట్లు పలికారు. అతన్ని కేకేఆర్ కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ ను లక్నో 19 కోట్లు దక్కించుకోనుంది.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×