Indian Railways: దీపావళి సందర్భంగా ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు చక్కటి ఆఫర్లను అందిస్తున్నాయి. డిస్కౌంట్ తో పాటు క్యాషన్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ ఆన్ లైన్ రైలు టికెటింగ్, ట్రావెల్ యుటిలిటీ ప్లాట్ ఫారమ్ Confirmtkt దీపావళి సందర్భంగా క్రేజీ ఆఫర్ ప్రకటించింది. దీపావళి సందర్భంగా లక్షలాది మంది ప్రయాణీకులకు టికెట్లపై పొదుపును అందించే ప్రయత్నం చేస్తోంది. ‘ది గ్రేట్ ఇండియన్ దీపావళి రైల్ సేల్’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి 28 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇందులో భాగంగా Confirmtkt యాప్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునే వినియోగదారులు రైలు టికెట్లపై 30% క్యాష్ బ్యాక్ ( సుమారు రూ.301 వరకు) అందిస్తుంది.
టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే?
ఈ ఈ పరిమిత కాల ఆఫర్ పండుగ ప్రయాణాలను మరింత సరసమైనదిగా, ఒత్తిడి లేకుండా చేయడానికి రూపొందించబడింది. ప్రయాణీకులు తమ దీపావళి ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. చెక్ అవుట్ సమయంలో వినియోగదారులు DIWALI30 కూపన్ కోడ్ ను అప్లై చేయడం ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. Confirmtktలో తక్షణమే క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంది. ఇక్సిగో ట్రైన్స్ & కన్ఫర్మ్ టికెటి సిఇఒ దినేష్ కుమార్ కోథా ఈ ఆఫర్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. “పండుగ ప్రయాణం ఆనందంగా ఉండాలి. ఇబ్బందిగా ఉండకూడదు. ‘గ్రేట్ ఇండియన్ రైల్ సేల్’ ప్రయాణీకులకు ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి, టికెట్లపై ఎక్కువ ఆదా చేసుకోవడానికి, సులభంగా ప్రయాణించడానికి అవకాశం కలుగుతుంది. కన్ఫర్మ్ టికెట్ తో ప్రతి ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం” అని వెల్లడించారు.
Read Also: అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!
కన్ఫర్మ్ టికెటి గురించి..
ConfirmTkt అనేది దేశంలోని ప్రముఖ ఆన్ లైన్ రైలు-యుటిలిటీ యాప్. ఆండ్రాయిడ్, Iosలో అందుబాటులో ఉంటుంది. వెయిట్ లిస్ట్ చేయబడిన టికెట్ల కోసం నిర్ధారణ అవకాశాలను అంచనా వేయడం, రియల్ టైమ్ రైలు స్టేటస్, కోచ్ ప్లేసెస్, ప్లాట్ ఫారమ్ నంబర్లు, సీట్ల లభ్యతను ట్రాక్ చేయడం ద్వారా వినియోగదారులు ధృవీకరించబడిన టికెట్లను పొందడంలో ఇది సహాయపడుతుంది. మెషిన్ లెర్నింగ్, సీట్ల కేటాయింపు మోడల్స్ ద్వారా ఆధారితమైన కన్ఫర్మ్ టికెట్లు అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను అందిస్తుంది. Confirmtkt వాలెట్ ద్వారా వినియోగదారులు పూర్తి రీఫండ్, వేగవంతమైన రీఫండ్ లతో ఉచిత రద్దును పొందే అవకాశం ఉంటుంది. Confirmtkt ప్రత్యక్ష రైలు టికెట్ బుకింగ్‌లను అనుమతిస్తుంది. Confirmtkt FY25లో 54 కోట్లకు పైగా వార్షిక యాక్టివ్ వినియోగదారులను కలిగి ఉంది.
Read Also: దీపావళి సందడి.. ఆ ఒక్క రాష్ట్రానికే 12 వేల ప్రత్యేక రైళ్లు!