E-Paper
Advertisement

District Review: తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్..?

District Review: తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్..?
Advertisement

District Review: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను మరింత పారదర్శకంగా,జవాబుదారీతనంతో ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన, సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. మార్చి 16 నుండి జూన్ 12, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించిన 99 రోజుల “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమ ఫలితాలను,క్షేత్రస్థాయి పనితీరును సమగ్రంగా స్క్రీనింగ్ చేసేందుకు జిల్లాకో సీనియర్ ఐఏఎస్,ఐఎఫ్ఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.ఈ స్పెషల్ ఆఫీసర్లలో స్పెషల్ చీఫ్​ సెక్రటరీలు, ప్రినిపల్ సెక్రటరీలు, వైస్ చైర్మన్లు, సెక్రటరీలు, కమిషనర్లు, సీఈవోలు, డైరెక్టర్లు, జాయింట్ సెక్రటరీ హోదాల్లోని ఐఏఎస్ లు ఉన్నారు. వీరంతా సర్కార్ పనితీరును ఫోకస్డ్ గా స్క్రీనింగ్ చేయనున్నారు.జూన్ 27 లోపు తమకు కేటాయించిన జిల్లాల క్షేత్రస్థాయి పర్యటనలు, పరిస్థితులపై ప్రత్యేక రిపోర్టు ఇవ్వాలని సీఎస్ రామకృష్​ణారావు సూచించారు.

సీఎం ఆదేశాలతోనే.. సమీక్షలకు సర్వం సిద్ధం..

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ విజయాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేదికలను సీఎం పరిశీలించారు. ఈ క్రమంలోనే, కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీల నుండి జిల్లా కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి నెలా తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర స్థాయి సమీక్ష తరహాలోనే ప్రతి జిల్లాలోనూ తక్షణమే సమీక్షలు నిర్వహించాలని, అందుకోసమే సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా రంగంలోకి దించింది.

ప్రత్యేక అధికారుల బాధ్యతలు – క్షేత్రస్థాయి స్క్రీనింగ్..

Advertisement

ప్రభుత్వ పథకాల ఇంప్లిమెంటేషన్, గ్రీవెన్స్ సెల్ మానిటరింగ్ లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న ఈ ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. అంతేగాక 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు తీరును,నిర్దేశిత లక్ష్యాల సాధనను ఈ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.ఇక గ్రామ సభలు,వార్డు సభలు, మండలం, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి సమావేశాలలో ప్రజలు లేవనెత్తిన సమస్యలను క్రోడీకరించి,వాటి పరిష్కారానికి జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తారు.దీంతో పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో అందిన దరఖాస్తులు,ప్రజల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.

Also Read: Mekedatu Project: తమిళనాడు రైతుల జోలికొస్తే ఊరుకోం.. ప్రధాని మోదీని కలిసిన సీఎం విజయ్ ఏం కోరారంటే..?

డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కు పీపీటీలు, బుక్‌లెట్స్..

Advertisement

ప్రతి జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులు, అందిన సంక్షేమ ఫలాలు, విజయగాథలు, వినూత్న ప్రయోగాలతో కూడిన ‘జిల్లా వారీగా పీపీటీ బుక్‌లెట్లను’, ప్రెజెంటేషన్లను రూపొందిస్తారు.ప్రభుత్వ విజయాలను సోషల్ మీడియా, ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ప్రెస్ మీట్లను నిర్వహిస్తారు.దీంతో పాటు జిల్లాల్లో విజయవంతమైన ఉత్తమ విధానాలను గుర్తించి, వాటిని ఇతర జిల్లాల్లోనూ అమలు చేసేలా జిల్లా కలెక్టర్లకు నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తారు.

జిల్లాల వారీగా నియమితులైన ముఖ్య అధికారులు వీరే…

జిల్లా అధికారి పేరు
హైదరాబాద్- జయేష్ రంజన్
​మేడ్చల్-మల్కాజిగిరి వికాస్ రాజ్
​రంగారెడ్డి- సబ్యసాచి ఘోష్
కరీంనగర్- సందీప్ కుమార్ సుల్తానియా
నిజామాబాద్- డా. యోగితా రాణా
​ఖమ్మం- అనుదీప్ దురిశెట్టి
మెదక్- వాణి ప్రసాద్
యాదాద్రి- ఎండీ ఎక్కా
వికారాబాద్- నవీన్ మిట్టల్
మహబూబ్ నగర్- దాన కిషోర్
సిద్ధిపేట్- అహ్మద్ నదీమ్
రాజన్న సిరిసిల్లా- శైలజా రామయ్యర్
భూపాలపల్లి- ఎన్ శ్రీధర్
సంగారెడ్డి- క్రిస్టినా జెడ్ చొంగ్తూ
ఆసిఫాబాద్- సోనిబాల
పెద్దపల్లి- లోకేష్​ కుమార్
నాగర్ కర్నూల్- షఫియుల్లా
హనుమకొండ- టీకే శ్రీదేవి
వరంగల్- బాల మాయాదేవీ
భద్రాద్రి- ఈ శ్రీధర్
నల్లగొండ- గౌరవ్ ఉప్పల్
నిర్మల్- ఇలంబర్తి
సూర్యాపేట్- సురేంద్ర మోహన్
కామారెడ్డి- విజయేంద్ర
జనగామ- శ్రీ దేవసేనా
నారాయణపేట్- హరిచందనా
మంచిర్యాల- దివ్యా దేవరాజన్
ఆదిలాబాద్- రాజీవ్ గాంధీ హన్మంతు
గద్వాల జోగులాంబ- శృతి ఓజా
జగిత్యాల- సిక్తా పట్నాయక్
వనపర్తి- వీపీ గౌతమ్
మహబూబాబాద్- హరీష్​
ములుగు- జండగే హనుమాన్ కొండిబా

Also Read: Today Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

Related News

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

Big Stories

Advertisement
×