E-Paper
Advertisement

కరెంట్ షాక్ ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి? ప్రాణాలు కాపాడేందుకు తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు

కరెంట్ షాక్ ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి? ప్రాణాలు కాపాడేందుకు తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు
Advertisement

కరెంట్ షాక్ అనేది అత్యంత ప్రమాదకరమైన అత్యవసర పరిస్థితి. ఇంట్లో, ఆఫీసులో, ఫ్యాక్టరీలో లేదా బయట ఎక్కడైనా ఈ ప్రమాదాలు సంభవించవచ్చు. తక్కువ క్వాలిటీ వైర్లు, దెబ్బతిన్న లేదా నిర్లక్ష్యంతా వదిలేసిన ఎలిక్ట్రిక్ పరికరాలు, కరెంట్ కనెక్షన్ ప్రమాదానికి కారణమవుతాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే బాధితుల ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది.

కరెంట్ షాక్ ఎందుకు ప్రాణాంతకం

విద్యుత్ ప్రవాహం శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండె, మెదడు, శ్వాసక్రియ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కరెంట్ తాకిడి వల్ల గుండె స్పందన అసాధారణంగా మారి గుండె ఆగిపోవడానికి కారణం కావచ్చు. అలాగే శ్వాసను నియంత్రించే కండరాల పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో బాధితుడు కరెంట్ వైర్లను వదలలేకపోతాడు. ఎక్కువసేపు కరెంట్ శరీరంలో ప్రవహిస్తే బాధితుడి ప్రాణాలు పోయే అవకాశం మరింత పెరుగుతుంది.

వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి

Advertisement

ఎవరైనా కరెంట్ షాక్‌కు గురైతే ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. మెయిన్ స్విచ్‌ను వెంటనే ఆఫ్ చేయాలి. విద్యుత్ ప్రవాహం ఆగిన తర్వాత మాత్రమే సహాయం చేయడానికి ప్రయత్నించాలి. చేతులతో నేరుగా వైర్లు తాకకూడదు. తడి నేలపై నిలబడకూడదు. అవసరమైతే పొడిగా ఉన్న కర్ర (చెక్క) లేదా విద్యుత్‌ ప్రసారం చేయని వస్తువులను ఉపయోగించాలి.

బాధితుడిని కరెంట్ మూలం నుండి దూరం చేయాలి

విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిన తర్వాత బాధితుడిని సురక్షితంగా దూరం చేయాలి. కరెంట్ ఇంకా కొనసాగుతున్నప్పుడు వ్యక్తిని తాకకూడదు. అలా చేస్తే మీకూ ప్రమాదం సంభవించవచ్చు. చుట్టుపక్కల మరే ఇతర ప్రమాదకర వస్తువులు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలించాలి. త్వరగా దూరం చేయడం వల్ల మరింత గాయాలు నివారించవచ్చు.

శ్వాస, గుండె స్పందనను పరీక్షించాలి

Advertisement

బాధితుడు శ్వాస తీసుకుంటున్నాడా లేదా వెంటనే పరిశీలించాలి. గుండె స్పందన ఉందో లేదో కూడా చూడాలి. శిక్షణ పొందిన వారు అయితే అవసరమైతే సీపీఆర్ చేయాలి. ఛాతీపై ఒత్తిడి ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ కొనసాగించవచ్చు. అత్యవసర వైద్య సిబ్బంది వచ్చే వరకు ప్రయత్నాలు కొనసాగించాలి.

బాధితుడిని నీటికి దూరంగా ఉంచాలి

కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని పొడి, సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాలి. నీటి దగ్గర ఉంచకూడదు. విద్యుత్ ప్రమాదం పూర్తిగా తొలగిన తర్వాత మాత్రమే కాలిన గాయాలను పరిశీలించాలి. చిన్న షాక్ అయినా వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. అంతర్గత గాయాలు వెంటనే కనిపించకపోవచ్చు.

Also Read: మీరు తరచూ రక్తదానం చేస్తున్నారా? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త.. శరీరంలో జరిగే మార్పులు ఇవే

కాలిన గాయాలకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి

కరెంట్ వల్ల చర్మంపై కాలిన గాయాలు ఏర్పడవచ్చు. విద్యుత్ ప్రమాదం పూర్తిగా తొలగిన తర్వాత సరైన చికి్త్స తీసుకోవాలి. గాయాలపై క్రీములు లేదా ఇంటి చిట్కాలు ఉపయోగించకూడదు. గాయపడిన భాగాన్ని శుభ్రంగా ఉంచి వైద్య సహాయం పొందాలి.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో వైద్య నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×