E-Paper
Advertisement

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!
Advertisement

Teacher Murder: ఫరీదాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. తరగతి గదిలోనే 30 ఏళ్ల లేడీ టీచర్‌ను, 21 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేశాడు. కేవలం 30 నుంచి 40 సెకన్ల వ్యవధిలోనే ఆవేశంతో రగిలిపోతూ ఆమె మెడ, ఛాతీ, కడుపు భాగాల్లో కత్తితో ఏకంగా 25 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సంధ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వీరిద్దరికీ గత రెండేళ్లుగా పరిచయం ఉంది. అయితే కొంతకాలంగా ఆ యువకుడు ఆమెను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అతడి వేధింపులు తట్టుకోలేక లేడీ టీచర్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కేసు నమోదు కావడంతో తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కక్షను ఆ యువకుడు పెంచుకున్నాడు. ఆ కోపంతోనే పక్కా పథకం ప్రకారం స్కూల్‌లోకి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ బస్సు.. స్పాట్‌లో 26 మంది ప్రయాణికులు!

Tags

Related News

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో భూముల రచ్చ.. 388 ఎకరాలు VS 933 ఎకరాలు

ఇంట్లోనే 30 ఏళ్లుగా పెరుగుతున్న పుట్ట.. భయంతో వణుకుతున్న వృద్ధురాలు!

అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. రేవంత్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

48 కిలోల పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం పూత? బేగంబజార్ గణనాథుడిపై పోలీసుల క్లారిటీ!

బీసీ కుల గణనపై కేంద్రం కుట్ర.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

నా భూమిలో చిన్న తప్పున్నా 13 ఎకరాలు రాసిచ్చేస్తా! సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

వైష్ణవి భర్త హరిబాబు హత్యపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ, సంతోష్ ‘రివేంజ్’ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×