E-Paper
Advertisement

సమాన్యుడికి ఒక రూల్.. సర్కార్‌కి ఒక రూలా.. సొంత ఆస్థిపన్నులో 90 శాతం వడ్డీ మాఫి చేసుకున్న సర్కార్!

సమాన్యుడికి ఒక రూల్.. సర్కార్‌కి ఒక రూలా.. సొంత ఆస్థిపన్నులో 90 శాతం వడ్డీ మాఫి చేసుకున్న సర్కార్!

Property Tax: స్వేచ్ఛ బ్యూరో: దశాబ్దాలుగా పేరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ను చెల్లించేందుకు సర్కారు సుముఖతను వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు 2217 కు చెందిన ఆస్తులకు సంబంధించి ట్యాక్స్ బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) కింద చెల్లించేందుకు సర్కార్ జీవో కూడా జారీ చేసింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం 1580.96 కోట్లకు పేరుకుపోయినట్లు సర్కారు జీవో లో పేర్కొంది.

వన్ టైమ్ సెటిల్ మెంట్..

వర్తమాన ఆర్థిక సంవత్సరానికి చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ రూ. 105.43 కోట్ల వరకున్నట్లు సర్కారు వెల్లడించింది. పాత, వర్తమాన ఆర్థిక సంవత్సరానికి చెందిన ట్యాక్స్ బకాయిలు రూ. 5864.92 కోట్లు ఉండగా, బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 90 శాతాన్ని వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ కింద మాఫీ చేస్తే మిగిలిన రూ. 1686.39 కోట్లు చెల్లించనున్నట్లు సర్కారు జీవోలో పేర్కొంది. వాస్తవానికి మార్చి నెలాఖరుతోనే వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) గడువు ముగిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ భారీగా పేరుకుపోవటం, జీహెచ్ఎంసీ పరిధి మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో, ఆ కార్పొరేషన్లలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్పొరేషన్లు సర్కారు ఆర్థిక సహాయంపైనే ఆధారాపడి ఉండటంతో సర్కారు ఓటీఎస్ స్కీమ్ కింద ట్యాక్స్ బకాయిలు చెల్లించేందుకు సిద్దమైనట్లు తెలిసింది.

Also Read: బడ్జెట్ ధరలో బెస్ట్ కిచెన్ చిమ్నీల.. రూ. 10 వేలలోపు టాప్ 5 ఆటో క్లీన్ ఆప్షన్స్ ఇవే!

జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ బకాయిలు

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిధిలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు 2217 పీటీఐఎన్ లకు సంబంధించి ఇప్పటి వరకు రూ.1580.96 కోట్లకు పేరుకుపోగా, ఈ బకాయిపై పేరుకుపోయిన వడ్డీ రూ.4178.53 కోట్ల గా ఉంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో గత, వర్తమాన ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సర్కారు చెల్లించాల్సిన మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ రూ.5864.92 కోట్లు కాగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం రూ.5612.04 కోట్లు చెల్లించాల్సి ఉండగా, వాటిలో వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ కింద వడ్డీ రూ. 4026.63 కోట్లను మినహాయించగా, జీహెచ్ఎంసీకి సర్కారు రూ. 1585.41 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక సైబరాబాద్ పరిధిలో కూడా సర్కారు ఆస్తులు 267 ఉండగా, వీటికి ఇప్పటి వరకు పేరుకుపోయిన వడ్డీ, ట్యాక్స్ మొత్తం రూ. 52.75 కోట్లుండగా, వడ్డీని మినహాయించగా, రూ. 24.87 కోట్లను సర్కారు చెల్లించనుంది. ఇక ఎంఎంసీలో కూడా సర్కాగరు ఆస్తులు 393 ఉండగా, మొత్తం ట్యాక్స్ బకాయిలు రూ. 200.13 కోట్లకు పేరుకుపోగా, వడ్డీని మాఫీ చేసిన తర్వాత రూ. 76.11 కోట్లను సర్కారు చెల్లించనుంది.

Also Read: కరెంట్ ఆఫీసర్ల పిల్లి మొగ్గలు.. భయంతో రాత్రికి రాత్రే రైతు డిస్కంపై పుట్టిన ప్రేమ!

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×