E-Paper
Advertisement

MLA Murali Naik: అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటెయ్యండి: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్

MLA Murali Naik: అభివృద్ధిని చూసి ఎన్నికల్లో ఓటెయ్యండి: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
Advertisement

MLA Murali Naik: స్వేఛ్చ బ్యూరబో: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం సంక్షేమం, పట్టణాల అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) పేర్కొన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన అభ్యర్థులను సర్వేలు చేసిన అనంతరమే ఎంపిక చేసి వార్డు కౌన్సిలర్ గా నియమించామన్నారు. నిరుపేదల కోసం పనిచేసే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చామని, వారంతా మునిసిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తారని వెల్లడించారు. 32 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ తరఫున బి ఫామ్ లను అందజేశామన్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పోటీ చేసే 32 వార్డులను సైతం కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

వామపక్షాలతోనే మునిసిపాలిటీ అభివృద్ధి..

వామపక్షాల సహకారంతోనే మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తెలిపారు. మొదటినుంచి సిపిఐ పార్టీతో పొత్తు ఉంటుందని, ఆ నేపథ్యంలోనే సిపిఐ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సిపిఎం( CPM) పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వడంతో పాటు మరొక వార్డులో ఫ్రెండ్లీ పోటీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీకి కూడా నాలుగు వార్డులు కేటాయించి మరొక వార్డులో ఫ్రెండ్లీ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. అయితే సిపిఐ పార్టీకి 6 నుంచి 7 సీట్లు కావాలనడంతో మునిసిపాలిటీలో పొత్తు కుదరలేదన్నారు. దీంతో సిపిఐ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో వెళ్లారని వివరించారు. సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి మునిసిపాలిటీ అభివృద్ధిని చేపడుతామన్నారు.

Advertisement

Also Read: Madhira Municipality: మధిరలో కారెక్కిన సిపిఐ సిపిఎం.. పొత్తు కుదరక మరో దోస్తీకి బ్రేకులు

రెండేళ్లలో రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు

ఇటీవలనే మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ. 80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇందులో రూ.20 కోట్లతో తాగునీటి కోసం ఖర్చు చేశామన్నారు. రూ. 60 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు కేటాయించామన్నారు. మున్సిపాలిటీలో పోటీ చేసే వార్డు కౌన్సిలర్లు 50 శాతం మంది కొత్త వారేనని వారిని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తారని వివరించారు.

Advertisement

Also Read: Sai Pallavi: ఫ్లాప్ హీరో కోసం ప్రభాస్‌ను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×