E-Paper
Advertisement

గ్రామ పంచాయతీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు!

గ్రామ పంచాయతీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు!
Advertisement

Panchayat Accounts: గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూరే నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసుకుని, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేపట్టింది.

ప్రత్యేక బ్యాంకు ఖాతాలు..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12,700 కి పైగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా జాతీయ బ్యాంకులను కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన బ్యాంకులో విధిగా ఒక ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ప్రారంభించాలని జిల్లా పంచాయతీ అధికారులకు సర్క్యులర్ మెమో ద్వారా స్పష్టం చేసింది.

గ్రామ పంచాయతీ పేరు..

Advertisement

ఈ ఖాతాలను ‘OSR Account – గ్రామ పంచాయతీ పేరు’ పేరుతో ప్రారంభించాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ఇకపై నేరుగా వాటి ఖాతాల్లోనే జమ అయ్యేలా, ఆ నిధులను గ్రామాభివృద్ధి అవసరాలకు వినియోగించుకునేలా ఈ చర్యలు చేపట్టింది.

Also read: సదర్ సమ్మేళనంలో తీవ్ర విషాదం.. దున్నపోతును ఆడిస్తూ బాలుడు మృతి!

ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకులకు బాధ్యతలు

Advertisement

పంచాయతీరాజ్ కమిషనర్ జారీ చేసిన మెమో ప్రకారం జిల్లాల వారీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) శాఖలను కేటాయించారు. జిల్లా పంచాయతీ అధికారులు తమ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధిత బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చట్టం-2018 ప్రకారం..

ఈ ఖాతాలను జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లుగా ప్రారంభించాలని, గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరుల ద్వారా వచ్చే అన్ని రాబడులు, వాటి నుంచి చేసే ఖర్చుల నిర్వహణకు ప్రత్యేకంగా వినియోగించాలని మెమోలో పేర్కొన్నారు. ఖాతాల నిర్వహణ, సంతకాల అధికారాలు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు. దీంతో గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయాన్ని వాటి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా ప్రభుత్వం చేపట్టిన చట్ట సవరణ అమలుకు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభమైంది.

Also read: కీసరలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.. వరుసగా పట్టుబడ్డ ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్!

Tags

Related News

బెట్టింగ్ కోసం దొంగగా మారిన తాపీ మేస్త్రీ.. తాడుతో చొరబడి ఎం చేసాడో తెలుసా..?

కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచింది నేనే: దయాకర్ రావు!

చెరుకు రైతులకు తీపి కబురు అందేనా.. టన్నుకు రూ.4 వేల ధర!

సదర్ సమ్మేళనంలో తీవ్ర విషాదం.. దున్నపోతును ఆడిస్తూ బాలుడు మృతి!

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సెంటర్ ప్రారంభం.. ఎంటో తెలుసా..?

హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. 12.54 లక్షల ఓటర్లకు నోటీసులు!

కీసరలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.. వరుసగా పట్టుబడ్డ ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్!

Big Stories

Advertisement
×