E-Paper
Advertisement

బెట్టింగ్ కోసం దొంగగా మారిన తాపీ మేస్త్రీ.. తాడుతో చొరబడి ఎం చేసాడో తెలుసా..?

బెట్టింగ్ కోసం దొంగగా మారిన తాపీ మేస్త్రీ.. తాడుతో చొరబడి ఎం చేసాడో తెలుసా..?
Advertisement

Gachibowli Theft: బెట్టింగులకు అలవాటు పడి ఉన్నదంతా పోగొట్టుకుని దొంగగా మారిన మేస్త్రీని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి చోరీ బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి, నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తో కలిసి వివరాలు వెల్లడించారు. కొండాపూర్ శిల్పా వ్యాలీలోని సారా ప్రైడ్ అపార్ట్ మెంట్ నివాసి అనుష్ కుమార్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.

టెర్రస్ నుంచి తాడు..

ఈనెల 2న బోరబండ నివాసి అనంత్ కుమార్ (28) ఎవరూ లేని సమయంలో నిందితుడు టెర్రస్ నుంచి తాడు సహాయంతో అనుష్ కుమార్ ఫ్లాట్ బాల్కనీలోకి ప్రవేశించాడు. స్లైడింగ్ డోర్, అల్మారాను పగులగొట్టి 35 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులను దొంగిలించి పరారయ్యాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు.

డఫా బెట్ యాప్..

Advertisement

సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేశించి అనంత్ కుమార్ చోరీ చేసినట్టు గుర్తించారు. గాలింపు చేపట్టి ఆదివారం రాత్రి గచ్చిబౌలి చౌరస్తా వద్ద నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి బంగారు, వెండి వస్తువులతో పాటు హోండా యాక్టివా స్కూటర్, మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు డఫా బెట్ యాప్ ద్వారా ఆన్‌ లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడి డబ్బు కోసం ఈ చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితున్ని అరెస్ట్ చేసిన క్రైం సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Also Read: కీసరలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.. వరుసగా పట్టుబడ్డ ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్!

Tags

Related News

కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచింది నేనే: దయాకర్ రావు!

చెరుకు రైతులకు తీపి కబురు అందేనా.. టన్నుకు రూ.4 వేల ధర!

సదర్ సమ్మేళనంలో తీవ్ర విషాదం.. దున్నపోతును ఆడిస్తూ బాలుడు మృతి!

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సెంటర్ ప్రారంభం.. ఎంటో తెలుసా..?

హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. 12.54 లక్షల ఓటర్లకు నోటీసులు!

కీసరలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.. వరుసగా పట్టుబడ్డ ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్!

ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్.. 48 గంటలు దాటితే ఆటోమేటిక్ సస్పెన్షన్!

Big Stories

Advertisement
×