E-Paper
Advertisement

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సెంటర్ ప్రారంభం.. ఎంటో తెలుసా..?

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సెంటర్ ప్రారంభం.. ఎంటో తెలుసా..?
Advertisement

SplashBI Hyderabad: జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం చేయకుండా ప్రపంచ స్థాయి ఉత్పత్తుల రూపకల్పన, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సేవలందిస్తున్న స్ప్లాష్‌బీఐ హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేయగా సోమవారం ప్రారంభించి మాట్లాడారు.

కొత్త జీసీసీలు..

ప్రస్తుతం నగరంలో 515కు పైగా జీసీసీలు ఉండగా, వాటిలో మూడు లక్షల మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారన్నారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. వచ్చే ఏడాదిలో కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లోనూ కీలక పాత్ర పోషించేలా వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు.

అమెరికన్ డాలర్ల పెట్టుబడులు..

Advertisement

స్ప్లాష్‌బీఐ ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 500కు పైగా ఎంటర్‌ప్రైజ్‌ సంస్థలకు సేవలందిస్తోందని వివరించారు. రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో హైదరాబాద్ లో 100 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్‌తో పాటు స్ప్లాష్ ఏఐ సామర్థ్యాలనూ అభివృద్ధి చేస్తుందని, ఇక్కడ కొత్తగా 275 మంది నిపుణులకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, స్ప్లాష్‌బీఐ సీఈఓ నవీన్‌ మిగ్లానీ, ప్రెసిడెంట్‌, సీటీఓ కిరణ్‌ రెడ్డి పాశం తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఇదేనా పెద్దరికం.. సంస్కారం లేదా.. నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్!

Tags

Related News

సదర్ సమ్మేళనంలో తీవ్ర విషాదం.. దున్నపోతును ఆడిస్తూ బాలుడు మృతి!

హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. 12.54 లక్షల ఓటర్లకు నోటీసులు!

కీసరలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.. వరుసగా పట్టుబడ్డ ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్!

ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్.. 48 గంటలు దాటితే ఆటోమేటిక్ సస్పెన్షన్!

బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా 63 ఏళ్ల మహిళ సైకిల్ యాత్ర.. భీమవరం నుంచి ఢిల్లీకి పయనం!

ఏఐ సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

Big Stories

Advertisement
×