E-Paper
Advertisement

హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. 12.54 లక్షల ఓటర్లకు నోటీసులు!

హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. 12.54 లక్షల ఓటర్లకు నోటీసులు!
Advertisement

Hyderabad SIR: ఓటరు జాబితాలో తప్పులను సరి చేసుకోవటంతో పాటు జాబితాలోని బోగస్, అనమాలిస్, డూప్లికేట్, రీపిటెడ్ ఓట్లను తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో తుది దశలో ఉంది. కొద్ది నెలల క్రితం జారీ చేసిన ఓటరు జాబితా ముసాయిదా తర్వాత సర్ 2002 సమాచారాన్ని ఎన్యుమరేషన్ ఫారంలో పొందుపర్చని ఓటర్లను గుర్తించి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సిటీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 లక్షల 54 వేల 917 మందిని గుర్తించి, ఇప్పటి వరకు 12 లక్షల 54 వేల 400 నోటీసులు జారీ చేయగా, మొత్తం నోటీసులలో ఇంకా కేవలం నాలుగు శాతం అంటే దాదాపు 517నోటీసులను జారీ చేయాల్సి ఉంది.

20 వేల 559 హియరింగ్‌లు..

జారీ చేసిన నోటీసులలో ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల 33 వేల 841 మంది ఓటర్లకు అంటే సుమారు 98.36 శాతం వరకు హియరింగ్ లను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వెల్లడించారు. మొత్తం చేపట్టాల్సిన హియరింగ్ లలో ఇంకా 1.64 శాతం అంటే 20 వేల 559 హియరింగ్ లు నిర్వహించాల్సి ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. మిగిలిన నోటీసులను కూడా వీలైనంత త్వరగా జారీ చేసి, పెడింగ్ లో ఉన్న విచారణలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, నవంబర్ నెలాఖరులో హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటరు తుది జాబితాను జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

స్వీకరించిన మొత్తం ఫారాలు 3 లక్షల 96 వేల 756

Advertisement

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు వివిధ రకాల సుమారు 3 లక్షల 96 వేల 756 ఫారాలను స్వీకరించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. వీటిలో కొత్తగా ఓటర్లు నమోదు కోసం ( ఫారం-6) కింద సుమారు 2 లక్షల 18 వేల 5 ఫారాలు, అలాగే ఓటరు సమాచార తొలగింపు కోసం వచ్చిన (ఫారం-7) కింద 11 వేల 277, ఫారం 6 ఏ కింద 4591, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటును బదలాయించుకునేందుకు ఫారం 8 కింద లక్షా 62 వేల 655 ఫారాలను స్వీకరించినట్లు, వివిధ రకాల మొత్తం ఫారాలను 3 లక్షల 96 వేల 756 వరకు స్వీకరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫారం-6 కిఆంద కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు సుమారు 2 లక్షల 18 వేల 5 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటనలో పేర్కొంది.

Also Read: బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

Tags

Related News

కీసరలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.. వరుసగా పట్టుబడ్డ ఎస్సై, డిప్యూటీ తహసీల్దార్!

ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్.. 48 గంటలు దాటితే ఆటోమేటిక్ సస్పెన్షన్!

బిగ్ బ్రేకింగ్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా 63 ఏళ్ల మహిళ సైకిల్ యాత్ర.. భీమవరం నుంచి ఢిల్లీకి పయనం!

ఏఐ సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్‌లో హ్యాకర్ల సునామీ.. మూడు NBFCలపై సైబర్ దాడి, రూ. 18 కోట్లు స్వాహా!

బంగ్లాదేష్ గ్యాంగ్‌తో ప్రేమలో పడి.. జీవితాన్ని నాశనం చేసుకున్న టెకీ?

Big Stories

Advertisement
×