Drought Declaration: రాష్ట్రంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి ఆర్ధిక సాయం చేయాలనిమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తే పాలకుర్తి నీ ఎందుకు కరువు మండలంగా ప్రకటించారని నిలదీశారు. పదేళ్లలో తెలంగాణ ఎట్ల ఉండే.. ఇప్పుడు మూడేళ్లలో ఎట్ల ఉన్నది ఒక్కసారి కాంగ్రెస్ నేతలు చూస్కోవాలని సూచించారు. నాడు కేసీఆర్ హయంలో ఎక్కడ కూడా కరువు మండలాలు లేవు. అప్పుడు వరద నష్టం ఉండే ఇప్పుడు కరవు నష్టం అంటున్నారన్నారు.
దేవాదుల ప్రాజెక్టు వద్ద నీటిని ఎత్తిపోసి నీళ్లు ఇచ్చామని, ఆరోజు రాత్రి మేడిగడ్డ దగ్గర బాంబు పేలింది అని అక్కడ రైతులు అంటున్నారన్నారు. ఏదో కుట్ర జరిగినదని అంటున్నారు. దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఇప్పుడు కూడా టు టీఎంసీల నీరు ఉన్నదన్నారు. ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. రాష్ట్రంలో కరువు తెచ్చింది కాంగ్రెస్ అని, కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు,దేశాలు చేతులెత్తేశాయి.కానీ కేసీఆర్ అధైర్య పడకుండా దైర్యం చెప్పారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకు సంబంధం లేదని చేతులు ఎత్తేశారన్నారు. నాడు తెలంగాణలో భూముల రెట్లు పెరిగాయి ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. మిషన్ భగీరథ పథకం ఇక్కడ అమలు చేసిన తర్వాత ఆ పథకం కేంద్రం అమలు చేసిందన్నారు.
Also Read: హైదరాబాద్ ఓటర్లకు బిగ్ అలర్ట్.. 12.54 లక్షల ఓటర్లకు నోటీసులు!
పొలీస్లు లేకుండా గ్రామాలకు వెళ్దమని కాంగ్రెస్ నేతలు రావాలని ప్రజలను కరెంటు, తాగునీళ్లపై అడుగుదామన్నారు. పెన్షన్ లు ఎక్కడ పోయాయి మహిళలకు ఫ్రీ బస్ అన్నావ్ మగవారికి డబుల్ ఛార్జీలు చేశావుఅని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో బ్రోకర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఇంకా మోసపోరు అన్నారు. తాను 7సార్లు గెలిచానన్నారు. కేసీఆర్ తర్వాత ఎక్కువ సార్లు తానే గెలిచానన్నారు. నేను రైతు కుటుంబంలో పుట్టాను వరంగల్ జిల్లా ప్రజలు నన్ను ఆదరిస్తారన్నారు. మేడిగడ్డ ను రిపేర్ చేసేందుకు మూడు నెలల్లో చేసి చూపెడుతాం అన్నారు.
హరీష్ రావు ఎందుకు అప్పజెప్పడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైన రాష్ట్రం బాగు చెయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందన్నారు. ప్రజలకు సాగు, తాగునీరు ఇవ్వాలని సూచించారు. విత్తనాలు కొంటే డిక్లరేషన్ ఇవ్వాలని అంట మాకు ఏం సంబంధం లేదని ఇదెక్కడి పరిస్థితి అన్నారు. గడ్డం గురించి మాట్లాడతారా? ఎవరికి నష్టం వచ్చినప్పుడు వాళ్ళు పెంచుతారు తీసేస్తారు. నేను కూడా ముప్పై ఏండ్లు పెంచాను మొన్న ఆరు ఏండ్లు తీసేసాను. ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నాను అని స్పష్టం చేశారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్.. 48 గంటలు దాటితే ఆటోమేటిక్ సస్పెన్షన్!