మొదటి దశలో రూ. 421 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. తొలి దశలో అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, నిర్మిస్తారు. అటు.. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఈ కొత్త నిర్మాణాలను కనెక్ట్ చేస్తారు.
రెండో దశలో రూ. 405 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ దశలో ఫిల్మ్ నగర్ జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెంబర్ 45 కలుపుతూ అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం ఉంటుంది. మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, పంజాగుట్టను కూడా రెండో దశలోనే కనెక్ట్ చేస్తారు.
Also Read: అంబర్‌పేటలో కేటీఆర్‌కు ఊహించని షాక్.. డిప్రేషన్‌లోకి కేసీఆర్?
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ నిర్మాణాలు చేపడుతోంది. రూ. 826 కోట్ల రూపాయలతో జరగనున్న ఈ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేశారు. నిర్మాణాలకు సంబంధించి డిజైన్‌లను జీహెచ్ఏంసీ రూపకల్పన చేసింది. ఆరు జంక్షన్ల అభివృద్ది నమూనా వీడియోలను తాజాగా జీహెచ్ఎంసీ విడుదల చేసింది.
ఈ నిర్మాణాలు పూర్తి అయితే.. హైదరాబాద్ బ్రాండ్ స్కై లెవెల్ లో పెరగడం ఖాయం. సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్టు హైదరాబాద్ ప్రపంచంలో పెట్టుబడుల హబ్ గా మారే అవకాశం ఉంది. అంతేకాదు.. ఆ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత నగరం రూపురేఖలు మరింతగా మారిపోనున్నాయి.