BigTV English

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!

Road roller accident Two young people are victims: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం మరో గ్రామానికి వెళ్లిన ఇద్దరు యువకులను రోడ్ రోలర్ డ్రైవర్ నిర్లక్ష్యం బలి తీసుకుంది. పని ముంగించుకొని నిద్రిస్తున్న ఆ ఇద్దరు యువకులపై రోడ్ రోలర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు.


వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం గ్రామ సమీపంలో ఓ కంపెనీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఈ కంపెనీలో పనిచేసేందుకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తమ కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని వెళ్లారు. అక్కడ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీలోనే రాత్రి వాచ్‌మెన్‌గా చేరారు. అయితే ఇంతలోనే విషాదం ఆ ఇద్దరిని వెంటాడింది.

బెంగళూరు నుంచి చెన్నై రహదారి రోడ్డులో రాత్రి వాచ్ మెన్ గా అషరఫ్, సాదిక్ ఇద్దరు పనిలో చేరారు. పని పూర్తయిన తర్వాత ఇద్దరు కొంత సేపు నిద్ర పోదామని అనుకున్నారు. ఇంతలో డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడు రోలర్ నడపడంతో వారిద్దరిపై వెళ్లిందిత. దీంతో ఇద్దరూ మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయాడు.


Also Read: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవులుగా పడిన వారిని చూసి రోదించారు. నెలకు రూ.11వేలకు ఇద్దరూ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి.

Tags

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×