E-Paper
Advertisement

అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!

అక్రమ పింఛన్ దారుల లక్కీ డేస్ క్లోజ్.. సీఎం రేవంత్ వద్ద బ్లాక్ లిస్ట్ రెడీ!
Advertisement

Fake Pensions: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న నకిలీ, అనర్హుల, మృతిచెందినవారి పింఛన్ల ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు అధికారులు నిఘా పెంచి, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అనర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా వివరాలు సేకరించిన సెర్ప్ అధికారులు.. నియోజకవర్గాల వారీగా డివైడ్ చేయడంలో నిమగ్నమయ్యారు.

ఆన్‌లైన్ లెక్కల్లోఅనర్హుల జాబితా..

రాష్ట్రవ్యాప్తంగా 42 ల‌క్ష‌ల మంది చేయుత పెన్ష‌న్ దారులుండ‌గా సుమారు 19 లక్షల4 వేల 239 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా కోర్ బ్యాంకింగ్ విధానంలో పెన్షన్ జమ అవుతోంది. సెర్ప్ నిర్వహించిన పైలట్ పరిశీలనలో పెద్దఎత్తున అక్రమాలు బయటపడటంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లైవ్ ఆథెంటిఫికేషన్ చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 17 లక్షల మంది (90 శాతం) లబ్ధిదారుల ధృవీకరణ పూర్తికాగా, మరో 2 లక్షల మంది ధృవీకరణ మిగిలి ఉంది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చేపట్టిన డిజిటల్ వెరిఫికేషన్ , క్షేత్రస్థాయి పరిశీలనలో భారీగా అవకతవకలు వెలుగుచూశాయి. అర్హత లేని వారు సైతం అనధికారికంగా పింఛన్లు పొందుతున్నట్లు తేలింది.

సీఎంకు నివేదిక..

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగాఅనర్హులే 1,28,818 ఉన్నట్లు అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. ఇందులో మృతిచెందినవారే 76372 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా గుర్తించని(వివరాలు అందుబాటులోలేని)45134 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 6064 మంది, పింఛన్ తీసుకోవడానికి ఆసక్తి చూపనివారు 1248 ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందుతున్న, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, మృతి చెందిన వారి పేర్లతో లబ్ధి పొందుతున్న వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు.

Alao Read: సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న NO UPI ఛాలెంజ్.. వీడియో వైరల్!

జగిత్యాలలో రికార్డు స్థాయిలో అనర్హులు

Advertisement

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మృతిచెందిన 76372 మంది ఉన్నారని, వారి పేరమీద పింఛన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో 6,979 మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు తేల్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో6574 మంది, సిద్దిపేటలో6027 మంది, హైదరాబాద్ లో 5053 మంది మృతిచెందినవారి పేర పింఛన్లు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక నియోజకవర్గాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో అమలవుతున్న పింఛన్ల తీరుతెన్నులపై, అక్కడ అనర్హులుగా తేలిన వారి జాబితాలపై అధికారులు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లలోని దొంగ లెక్కలను పూర్తిగా ఏరివేసేందుకు క్షేత్రస్థాయి బృందాలను అప్రమత్తం చేశారు.

అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమగ్ర వివరణ

ఫేక్ పింఛన్ల వ్యవహారంపై త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం సమగ్రమైన నివేదికను సమర్పించనుంది. అర్హులకు పింఛన్లు తొలగిస్తున్నారని ప్రధానప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో వివరాలను పకడ్బందీగా సేకరిస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గుర్తించిన అనర్హుల జాబితాలను, ముఖ్యంగా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ వంటి ప్రధాన నియోజకవర్గాల వివరాలను సభ ముందుంచి, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా అనుసరించాల్సిన కఠిన విధానాలపై సర్కార్ స్పష్టత ఇవ్వనుంది. అర్హులకు అన్యాయం జరగకుండా, అనర్హుల ఏరివేత ద్వారా ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పెన్షన్లపై ప్రతిపక్షాల విమర్శలకు లెక్కలతో కౌంటర్ ఇవ్వాలని, గతంలో ఎంత దుర్వినియోగం అయిందనేది కూడా వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Also Read: చాణక్య నీతి.. ఈ 5 తప్పుల వల్లే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు

Related News

జూనియర్ ఐఏఎస్‌లకు బంపర్ ఆఫర్.. సీఎం రేవంత్ టూర్ లిస్ట్‌లో బిగ్ చేంజెస్!

తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

మేడ్చల్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై ఈసీఐ సెక్రటరీ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఓటర్లకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ‘SIR’ గడువు పొడిగింపు.. ఎన్ని రోజులంటే?

మీ ఓటు ఉందో లేదో డౌటా? ఒక్క మెసేజ్‌తో ఇలా చెక్ చేసుకోండి!

Big Stories

Advertisement
×