E-Paper
Advertisement

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్.. ఏ ఏరియాల్లో అంటే?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్.. ఏ ఏరియాల్లో అంటే?
Advertisement

Power Cut: హైదరాబాద్‌ నగరంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ లైన్ల వార్షిక నిర్వహణ, సాంకేతిక మరమ్మతుల కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎండల తీవ్రత పెరిగినప్పుడు లేదా వర్షాకాలంలో అంతరాయాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ పనులు చేపడుతున్నారు. నగరంలోని ప్రధాన డివిజన్లలో ఏయే సమయాల్లో పవర్ కట్ ఉంటుందో తెలుసుకుని, గృహ అవసరాలను దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

ఆల్విన్ కాలనీ పరిధిలో..
లాస్ట్‌బస్టాప్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నారు. ముఖ్యంగా చక్రధర్‌కాలనీ, ధరణినగర్‌, ఆల్విన్‌కాలనీ ఫేజ్‌-2, ఆల్విన్‌ కాలనీ లాస్ట్‌బస్టాప్‌, వెంకటయ్య నగర్‌, తులసి నగర్‌, తులసీవనం అపార్ట్‌మెంట్స్‌ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ మూడు గంటల పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

ఉప్పల్, ఏఎస్‌రావునగర్ ఏరియాల్లో..
ఉప్పల్‌ కల్యాణ్‌పురి ఫీడర్‌ పరిధిలోని ఎన్‌జీఆర్‌ఐ సబ్‌ స్టేషన్‌లో నిర్వహణ పనుల వల్ల ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు జాహీద్‌ నగర్‌, బ్యాంక్‌ కాలనీ, ఇందిరానగర్‌, అంబేడ్కర్‌ నగర్‌, సీతారాం కాలనీ, కల్యాణ్‌పూరి, బాలాజీ ఎన్‌క్లేవ్‌, రాఘవేంద్ర కాలనీ, టీచర్స్‌ కాలనీలలో పవర్ కట్ ఉంటుంది. అలాగే ఏఎస్‌రావునగర్‌ పరిధిలోని గోకుల్‌నగర్‌, పార్వతీనగర్‌, హెచ్‌ఐజి-ఏ, ఆఫీసర్స్‌ కాలనీ, శారదా, అంకురా ఆస్పత్రి ప్రాంతాల్లో ఉదయం 11:00 నుంచి 11:30 వరకు, రాధికా చౌరస్తా ప్రధాన రహదారి పరిసరాల్లో మధ్యాహ్నం 12:00 నుంచి 12:30 వరకు సరఫరా నిలిచిపోనుంది.

చిక్కడపల్లి, ఆజామాబాద్ డివిజన్లలో..
ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం స్వల్ప సమయం పాటు పవర్ కట్ విధిస్తున్నారు. మదర్‌డైరీ 11 కేవీ ఫీడర్‌ పరిధిలో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, విద్యానగర్‌ పరిధిలో మధ్యాహ్నం 12:30 నుంచి 1:00 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదు. భవిష్యత్తులో లోడ్ తట్టుకునేందుకు, వైరింగ్ సమస్యలను అధిగమించేందుకే ఈ తాత్కాలిక కోతలు విధిస్తున్నామని, పనులు పూర్తి కాగానే సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Also Read: దారుణం.. జ్యోతిష్యుడు చెప్పాడని కన్నకొడుకునే చంపిన తండ్రి.. అసలేం జరిగిందంటే?

Related News

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర.. 1500 కండక్టర్ పోస్టుల భర్తీ, విద్యార్హతలో తర్జన భర్జన

ఉదయం నిరసన సెగ.. సాయంత్రానికే దిగొచ్చిన హైడ్రా.. బస్తీవాసుల ఆందోళనలకు కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

Half Dozen Murders: ఆరుగుర్ని చంపిన ఉన్మాది.. పోక్సోకేసులో రివేంజ్ డ్రామా, రంగారెడ్డి జిల్లాలో దారుణం

ఓఆర్​ఆర్​ పై ఏఐ నిఘా.. ప్రమాదాల నివారణకు పోలీసుల మాస్టర్ ప్లాన్!

కాంగ్రెస్ నేతలకు ‘కంటి ఆపరేషన్’ చేయించాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

చార్మినార్‌కు నాలుగు మినార్లు ఎందుకు ఉన్నాయి? దీని వెనుక ఉన్న 400 ఏళ్ల నాటి రహస్యం ఇదే!

కాళేశ్వరం కూలితే క్షమాపణ చెప్పకుండా మళ్లీ మంత్రి పదవా? హరీష్ రావుపై మంత్రి వివేక్ ఫైర్

Big Stories

Advertisement
×