Panchayat Election Results: తెలంగాణ గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ నిర్వహించగా.. యువతకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్ర క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి కల్పించారు.
ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రస్తుతం ఓట్ల లెకింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాసేపట్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మొదటి విడతలో భాగంలో రాష్ట్రంలో మొత్తం 3834 సర్పంచ్, 27,628 వార్డు మెంబర్ల పదవులకు ఎన్నికలు జరిగాయని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికల్ల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది.
మొత్తం 79.15 శాతం పోలింగ్..
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది..
నాలుగు ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం అరెపల్లి గ్రామ సర్పంచ్ గా నాలుగు ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పాతరబోయిన స్రవంతి గెలిచారు.
ఇప్పటి వరకు ఎవరెన్ని స్థానాలు గెలిచారంటే..?
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు: 1872
బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు: 950
బీజేపీ బలపరిచిన అభ్యర్థులు: 151
ఇతరులు: 419
ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో…?
కాంగ్రెస్ – 28
బీఆర్ఎస్ – 16
ఇతరులు – 3
సంగారెడ్డి జిల్లా(09/136 గ్రామ పంచాయతీలు)లో…..
కాంగ్రెస్-05
BRS-02
స్వతంత్రులు- 02
సిద్ధిపేట జిల్లాలో..
దౌల్తాబాద్ (మం) గువ్వలేగి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి శేఖర్ రెడ్డి 57 ఓట్ల తేడాతో గెలుపు
సిద్దిపేట జిల్లా(23/163 గ్రామ పంచాయతీలు)
BRS-06
కాంగ్రెస్-05
స్వతంత్రులు-12
కామారెడ్డి జిల్లాలో ఒక్క ఓటుతో గెలుపు..
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం నడిమితండాలో సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. హోరాహోరీ పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీ ఒకే ఒక్క ఓటుతో గెలిచారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకంది. తమకు భోజనం రాలేదని.. ఓట్లు లెక్కించమని ఎన్నికల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఓట్ల లెక్కింపు ప్రక్రయిను ఆపేశారు. భోజనం వచ్చాక.. లంచ్ చేసాక ఓట్లు లెక్కిస్తామని సిబ్బంది వాపోయారు. కొద్దిసేపు అనంతరం అధికారులు.. భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన అనంతరం కొంత ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
ALSO READ: Telangana BJP: తెలంగాణ ఎంపీలపై మోదీ సీరియస్.. ఇలా అయితే కష్టం, బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్