బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

హెల్త్ కార్డుల ఇష్యూపై వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం!

హెల్త్ కార్డుల ఇష్యూపై వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం!

Health Cards: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాల ఉద్యోగులు, పెన్షన్ దారులు ఆందోళనలో ఉన్నారని, హెల్త్ కార్డ్స్ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారని, వారికి సకాలంలో వేతనాలు రావడం లేదన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది..

హెల్త్ కార్డ్స్ ఇష్యూ పై కమిటీ వేశారే తప్పా, హెల్త్ కార్డ్స్ మాత్రం ఇవ్వడం లేదన్నారు. కమిటీ ముఖ్యమంత్రి మాట వినడం లేదా, ముఖ్యమంత్రి మాట కమిటీ వినడం లేదా అర్ధం కావడం లేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో రావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ధోరణి ఇలానే ఉంటే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు.

మాయ మాటలు చెప్పి ఉద్యోగుల ఓట్లు

పీఆర్సీ 6 నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పి రెండున్నర యేండ్లు అవుతున్న ఇవ్వడం లేదన్నారు. ఈహెచ్ఎస్ ను ఆసుపత్రులు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ హయంలో ఉద్యోగులను కాపాడుకున్నామన్నారు.పీఆర్సీ పై కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి ఉద్యోగుల ఓట్లు దండుకుందన్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి నెలకు 2 వేల నుంచి 3 వేల వరకు డబ్బులు కట్ అవుతున్నాయన్నారు. ఉద్యోగి జీతం నుంచి డబ్బులు కట్ చెయ్యమని ఈ ప్రభుత్వానికి చెప్పింది ఎవరు అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ ట్రీట్ మెంట్ కు ఆసుపత్రి యాజమాన్యం అడ్మిట్ చేసుకోవడం లేదన్నారు.

ఉద్యోగులు చనిపోతే పూర్తి బాధ్యత వహించాలి

ఈహెచ్ఎస్ ట్రీట్ మెంట్ విషయంలో ఉద్యోగులను తక్కువ చేస్తే ఆ ఆసుపత్రి పై సీఎస్ చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యోగులను తక్కువ చేసి చూస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం విషయంలో ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఆరోగ్యం విషయంలో ఉద్యోగులు చనిపోతే పూర్తి బాధ్యత వహించాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు.

జి. దేవీప్రసాద్ మాట్లాడుతూ..

జూన్ 1 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెల్త్ కార్డ్స్ ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు. మాతో కలిసొచ్చిన ఉద్యోగ సంఘాలతోనే మేము కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ మాట్లాడుతూ హెల్త్ కార్డ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తుందన్నారు.హెల్త్ కార్డ్స్ పై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో టీ ఎన్ జీ ఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు.

Also Read: మేడ్చల్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్!

Related News

తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!

‘సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు’.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

తెలంగాణను ‘గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్’గా మారుస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ లేకపోతే సీజే.. రవాణా శాఖ సంచలన నిర్ణయం

ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ

తెలంగాణలో పవన్ పోటీ చేయెుచ్చు.. ఎప్పుడైనా రావొచ్చు, వెళ్లొచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి

ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను ఆపారు? ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత

×