E-Paper
Advertisement

TG High Court: ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఈరోజు కోర్టుకి హాజరు కావాల్సిందే : హైకోర్టు జడ్జి రాజేశ్వరరావు

TG High Court: ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఈరోజు కోర్టుకి హాజరు కావాల్సిందే :  హైకోర్టు జడ్జి రాజేశ్వరరావు
Advertisement

TG High Court: తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర రావు గారు సోమవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది తెలంగాణ విశ్రాంత ప్రభుత ఉద్యోగులు తమ పదవీవిరమణ బాకాయిలు దాదాపు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదని గత ఏడాది కోర్టుని ఆశ్రయించారు. అందుకు స్పందిస్తూ న్యాయమూర్తి రాజేశ్వర రావు గారు ఆ బాకాయిలను సత్వరం చిల్లించాల్సిందిగా గత సంవత్సరం ఆదేశాలు ఇచ్చారు. అయితే, సంవత్సరం పైచిలుకు గడిచినా ఆ ఆదేశాలను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయకపోవడంతో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు ధిక్కార నేరం కింద ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిపై చర్యలు కోరుతూ ఓ ఆరు నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై వివరణ ఇవ్వాలి 

అనేక గడువుల తర్వాత గత గడువు సందర్భంగా న్యాయమూర్తి గారు ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శినీ వ్యక్తిగతంగా హాజరై కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ ఫాం వన్ జారీ చేస్తూ దాదాపు 644 కోర్టు ధిక్కార కేసులను ఈరోజుకి వాయిదా వేశారు. అయితే ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి మాత్రం సోమవారం నాడు కూడా కోర్టుకి హాజరు కాలేదు. కొంతమంది ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, అకవున్టేంట్ జనరల్ ఆఫీసుల తరపున కోర్టుకి హాజరు అయ్యారు. కోర్టు ఆదేశాల అమలుకోసం గతంలో చాలా సార్లు విజయవంతంగా కోర్టు ద్వారా గడువులు పొందిన ప్రభుత్వ న్యాయవాది ఈరోజు కూడా ఆర్థిక కార్యదర్శి కోసం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ అభ్యర్థించడంపై న్యాయమూర్తి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Also ReadTelangana Council Session-2026: హైదరాబాద్ సిటీ అభివృద్ధి.. మూసీ ప్రాజెక్టుపై మండలిలో సీఎం రేవంత్ ప్రకటన

హాజరు కాకపోతే ఉపేక్షించేది లేదు

బకాయిలు చెల్లించాల్సిందిగా కోర్టు గత ఏడాది ఆదేశాలు ఇచ్చింది. వాటిని ఇప్పటివరకూ పూర్తిగా ప్రభుత్వం అమలు పరచలేదు. కోర్టు ధిక్కార నేర ఆరోపణలపై నోటీసులు జారీ చేసికూడా ఆరు నెలలు దాటింది. ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించిన వార్తలు వచ్చాయి. వ్యక్తిగతంగా ఈరోజు హాజరు ఎట్టి పరిస్థితుల్లోనైనా కావాల్సిందిగా గత గడువు నాడు ఈ కోర్టు ఆదేశించింది. అయినా కూడా తను హాజరు కాకపోవడం పట్ల ఉపేక్షించేది లేదు, అని న్యాయమూర్తి రాజేశ్వర రావు గారు అన్నారు. ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో మునిగి ఉన్నారనీ, కోర్టుకి రాలేక పోయారనీ, అందుకే ఈలోపు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఈరోజు కోర్టుకి ఉదయం విన్నపం సమర్పించామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

అర్థరాత్రి వరకైనా  నేను కోర్టు హాల్లోనే వేచి చూస్తా

Advertisement

అసెంబ్లీ సమావేశాలు ఉన్న సంగతి వాళ్లకి ముందే తెలిసినందున అలాంటి విన్నపం ఏదైనా ఉంటే ముందే సమర్పించి ఉంటే కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేదనీ, అలా చేయకపోవడాన్ని ఈరోజు మాత్రం ఉపేక్షించేది లేదని న్యాయమూర్తి గారు స్పష్టం చేశారు. ఈరోజు ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. కావాలంటే ఈరోజు అర్థరాత్రి వరకైనా కావాలంటే నేను కోర్టు హాల్లోనే వేచి చూస్తాను. వ్యక్తిగత హాజరు నుంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదు” అని న్యాయమూర్తి రాజేశ్వర రావు గారు విస్పష్టంగా పేర్కొన్నారని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల తరపు న్యాయవాది సీ ఆర్ సుకుమార్ తెలిపారు.

Also Read: KCR Absence: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదేనా? ఆ భయం వెంటాడుతోందా?

Related News

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

Big Stories

Advertisement
×