BigTV English

Telangana highcourt: వేణు స్వామిపై మహిళా కమిషన్ నోటీసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana highcourt: వేణు స్వామిపై మహిళా కమిషన్ నోటీసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana highcourt serious on Women’s Commission about Venuswami issue: సంచలన సెలబ్రిటీల జోశ్యుడు వేణుప్వామికి హైకోర్టులో ఊరట లభించింది. నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం తర్వాత వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీరిద్దరూ ముహూర్తాలు చూసుకోకుండా అమావాశ్య తిధులలో ఏకం అయ్యారని..సమంత కాపురంలాగానే వీరి కాపురం కూడా విడిపోతుందని అన్నారు. 2027 సంవత్సరం తర్వాత నాగచైతన్య, శోభిత తన జాతకం ప్రకారం విడిపోతారని వ్యాఖ్యలు చేస్తూ ఓ సంచలన వీడియో కూడా విడుదల చేశారు వేణుస్వామి.


మహిళా సంఘానికి ఫిర్యాదు

వేణు స్వామి వ్యాఖ్యలతో సినిమా ఇండస్ట్రీ భగ్గుమంది. సినిమా జర్నలిస్టు సంఘాలన్నీ కలిసి వేణుస్వామిపై మహిళా సంఘానికి ఫిర్యాదు చేశాయి.జర్నలిస్ట్ సంఘాలతో సహా దాని అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిలిం డిజిట్ మీడియా అసోసియేషన్ సైతం ఫిర్యాదు చేశాయి. అయితే ఈ విషయంలో నాగచైతన్య గానీ, శోభిత గానీ వేణుస్వామి మాటలు అంతగా పట్టించుకోలేదు. అయితే వారిద్దరి కన్నా ఇతరులే ఎక్కువగా స్పందించారు. సినీ జర్నలిస్టుల ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర మహిళా కమిషన్. దీనితో వేణుస్వామిని వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపించారు.


హైకోర్టు సీరియస్

వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దీనిని సవాల్ చేస్తూ వేణు స్వామి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. తెలంగాణ మహిళా కమిషన్ నోటీసుల జారీపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. అసలు నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభితలు ఈ విషయంలో ఎలాంటి స్పందనలూ తెలపలేదు. వారికి లేని అభ్యంతరం మీకెందుకంటూ మహిళా సంఘానికి అక్షింతలు వేసింది. వారి నుంచి ఫిర్యాదులు వస్తే అప్పుడు చూస్తాం..అప్పటి దాకా దీనిపై తాము స్పందించలేమంటూ హైకోర్టు తెగేసి చెప్పింది. అంతేకాదు తెలంగాణ మహిళా సంఘాలు పంపించిన నోటీసులు చెల్లుబాటు కావని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

వేణుస్వామి ఆనందం

దీనితో వేణుస్వామి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బావ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు కొందరు మీడియా వ్యక్తులు. వారి ఫిర్యాదు పట్టుకుని మహిళా సంఘాలు కూడా ఇలాంటి నోటీసులు పంపించడం ఎంత మాత్రం భావ్యం కాదని వేణుస్వామి అంటున్నారు. అయితే సినిమా జర్నలిస్టులు మాత్రం ఈ సంగతి ఇక్కడితో వదిలేయమని..దీనిపై ఎంతదాకా అయినా వెళతామని..వేణు స్వామికి తగిన రీతిలో సమాధానం చెబుతామని అంటున్నాయి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×