BigTV English

Djokovic advances: ఆసక్తిగా సాగుతున్న యూఎస్ ఓపెన్.. తర్వాత రౌండ్‌లో జకోవిచ్

Djokovic advances: ఆసక్తిగా సాగుతున్న యూఎస్ ఓపెన్.. తర్వాత రౌండ్‌లో జకోవిచ్

Djokovic advances: యూఎస్ ఓపెన్ ఆసక్తికరంగా సాగుతోంది. టాప్ సీడ్ ఆటగాళ్లు దూకుడు మీదున్నారు. తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించి తర్వాత రౌండ్‌కు అర్హత సాధించారు. తాజాగా ప్రపంచ నెంబర్ టూ ఆటగాడు జకోవిచ్‌కు సునాయాశంగా మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.


యూఎస్ ఓపెన్‌లో సెర్బియాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు తలపడ్డారు. వారిలో ఒకరు ప్రపంచ నెంబర్ టూ నవోక్ జకోవిచ్ కాగా, మరొకరు లాస్లో డిజేరే. ఇద్దరి మధ్య నువ్వానేనా అన్నరీతిలో పోటీ ఉంటుందని భావించారు. రెండు సెట్లను సొంతం చేసుకున్న జకోవిచ్, మూడో సెట్ కూడా అదే స్థాయిలో పోటీ జరుగుతుందని భావించారు అభిమానులు.

కాకపోతే లాస్లో డిజేరే గాయం కారణంగా వెనుదిరిగాడు. దీంతో జకోవిచ్ స్మాల్ రిలీఫ్ లభించింది. దీంతో మూడు సెట్లను 6-4, 6 -4, 2-0 తేడాతో విజయం సాధించాడు. ఏస్‌ల విషయంలో డిజేరే ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనవసర తప్పిదాలు జకోవిచ్ ఎక్కువగా చేసినా, సెకండ్ బ్రేక్ పాయింట్‌ ద్వారా మ్యాచ్‌ని తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు.


మరో మ్యాచ్‌లో ఇటలీకి చెందిన లొరెంజో ముసెట్టి అతి కష్టంమీద మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇరువురు మధ్య ఆది నుంచి ఉత్కంఠ పోరు సాగింది. ఇటలీకి చెందిన ముసెట్టి- సెర్బియాకు చెందిన కెక్మానోవిక్ మ్యాచ్ జరిగింది. తొలిసెట్‌ను గెలుచుకున్న కెక్మానోవిక్, సెకండ్, థర్డ్ సెట్స్ నుంచి ప్రతిఘటన ఎదురైంది.

నాలుగు సెట్‌లో ముసెట్టిని చావు దెబ్బ కొట్టాడు. ఇరువురు ఆటగాళ్లు రెండేసి సెట్స్ గెలుచుకోవడంతో ఐదో సెట్ ప్రతిష్టాత్మకంగా మారింది. అతి కష్టమ్మీద ముసెట్టి గెలుచుకుని మూడో రౌండ్‌లో అడుగు పెట్టాడు. టోర్నీ మొదలు ఇప్పటివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐదు సెట్లు ఆడిన మ్యాచ్ ఇదే. అన్ని విభాగాల్లో ఇరువురి బలాబలాలు సరిపోయినప్పటికీ, ఏస్‌ల విషయంలో ముసెట్టి అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. అలాగే తొలిసారి సర్వీస్ విషయంలో కలిసొచ్చింది. దీంతో ఐదు సెట్ల మ్యాచ్ ను 3-6, 6-4, 6-4, 2-7, 7-5 తేడాతో గెలిచాడు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×