E-Paper
Advertisement

చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!

చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!
Advertisement

Expired Biscuits: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో షాకింగ్ చోటుచేసుకుంది. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న షాపు యాజమానితో ఆహార భద్రతా అధికారి కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ స్థానికులు ఆయనకు ఝలక్ ఇచ్చేరు. తమకు విక్రయిస్తున్న ఎక్స్ పైరీ బిస్కట్లను మీరు కూడా తినండి అంటూ కొందలు లోకల్స్.. అతడి నోట్లో బలవంతంగా వాటిని పెట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివాదానికి నేపథ్యం..

స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఒక లోకల్ పాన్ షాప్‌లో కొనుగోలు చేసిన కారప్పూస తిన్న రెండేళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చిన్నారికి కళ్లు తిరగడం, వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు భయపడి వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దుకాణంలో ఎక్స్‌పైర్ అయిన ఆహార పదార్థాలు విక్రయించడం వల్లే తమ బిడ్డ ప్రాణాల మీదికి వచ్చిందని భావించిన బంధువులు, స్థానికులు.. వెంటనే ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఎఫ్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికారి నిర్లక్ష్యం.. లంచం ఆరోపణలు

Advertisement

స్థానికుల ఫిర్యాదు ఆధారంగా ఒక ఎఫ్‌డీఏ అధికారి సదరు పాన్ షాప్‌ వద్దకు తనిఖీకి వచ్చారు. అయితే అధికారి రాకముందే చిన్నారి అస్వస్థతకు కారణమైన స్నాక్ పాకెట్లను షాపు నుంచి మాయం చేశారని గ్రామస్థులు ఆరోపించారు. తనిఖీల్లో భాగంగా దుకాణంలో పెద్ద ఎత్తున గడువు ముగిసిన బిస్కెట్ పాకెట్లు లభించినప్పటికీ సదరు వ్యాపారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో అధికారి వ్యాపారస్తుడి నుంచి లంచం తీసుకుని కేసును పక్కదోవ చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలు ఆయనను నిలదీశారు.

Advertisement

Also Read: రాష్ట్రంలో ఘోరం.. రాఖీ పండక్కి ఊరికి వెళ్తే.. 30 మంది కొట్టి చంపారు!

ఎక్స్ పైరీ బిస్కెట్లు పెట్టే యత్నం..

అధికారిపై ఆగ్రహంతో రగిలిపోయిన స్థానికులు.. దుకాణంలోని ఎక్స్ పైరీ అయిన బిస్కెట్లను అధికారికి తినిపించే ప్రయత్నం చేశారు. ఆయన్ను చుట్టుముట్టి ‘ఈ బిస్కెట్లు సురక్షితమే అయితే ముందు నువ్వే తిను’ అంటూ గట్టిగా కేకలు వేశారు. కొందరు వ్యక్తులు ఆ ఎక్స్‌పైరీ బిస్కెట్లను బలవంతంగా ఆయన నోట్లో కుక్కేందుకు ప్రయత్నించారు. కాగా మహారాష్ట్ర వ్యాప్తంగా కాలం చెల్లిన పదార్థాల విక్రయాలపై ఎఫ్‌డీఏ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ రచ్చ జరగడం గమనార్హం.

Also Read: మంత్రి సురేఖ ఎపిసోడ్‌.. సీఎం రేవంత్ సైలెన్స్ వెనుక పెద్ద స్కెచ్ ఉందా?

Tags

Related News

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

గంగానదిలో పడవ బోల్తా.. మహిళలు-పిల్లలతో సహా 14 మంది మృతి, బీహార్‌లో ఘటన

ఢిల్లీ నిరసనలను అడ్డంపెట్టుకుని పాక్ డ్రామాలు.. 200లకు పైగా ఫేక్ పోస్టులు డిలీట్!

Big Stories

Advertisement
×