E-Paper
Advertisement

ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!

ఈసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!
Advertisement

Big boss 10 Grand Launch:తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) అతి త్వరలో ప్రారంభం కాబోతోంది అంటూ మేకర్స్ ఎప్పటికప్పుడు ఊరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఆ సమయం ఆసన్నమైంది. ఈ మేరకు బిగ్ బాస్ సీజన్ 10 అధికారిక లాంచింగ్ కి సంబంధించిన ఒక వీడియోని మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు. ఇందులో హోస్ట్ నాగార్జున పది రెట్లు ఎంటర్టైన్మెంట్ అంటూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ప్రేక్షకుల ముందుకు దశావతారం అంటూ రాబోతున్న ఈ బిగ్ బాస్ సీజన్ 10 అధికారికంగా ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంచ్ ఆరోజే..

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 10 ప్రారంభం కాబోతోంది. దీనికి దశావతారం అంటూ పేరు పెట్టి అంచనాలు రెట్టింపు చేశారు. ఇక ఈ హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్ లిస్టు కూడా ఒకవైపు జోరుగా వైరల్ అవుతోంది. అయితే సెప్టెంబర్ ఆరవ తేదీన రాత్రి 7 గంటలకు స్టార్ మా ఛానల్ వేదికగా చాలా గ్రాండ్ గా ఈ షోని ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి అయితే సోషల్ మీడియాలో ఇన్ని రోజులు వస్తున్న రూమర్స్ ను నిజం చేస్తూ సెప్టెంబర్ ఆరవ తేదీన గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు.

అంచనాలు రెట్టింపు చేస్తున్న వీడియో..

Advertisement

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా,అలాగే ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా వేదికగా ఈ షో ప్రారంభం కానుంది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన వీడియో విషయానికి వస్తే.. ఒక యువకుడు టీ స్టాల్ వద్దకు వచ్చి, పది రూపాయల నోటు చూపిస్తూ అన్న ఒక టీ అంటూ అడుగుతారు. టీ బాయ్ గెటప్ లో ఉన్న నాగార్జున.. తన చేతిలో పలు రకాల టీలు పట్టుకొని.. లెమన్, తులసి, ఇలాచి, మింట్ ,బ్లాక్, గ్రీన్ , కశ్మీరీ , మసాలా అంటూ పలు రకాల టీ గురించి చెబుతాడు ఏంటి ఇన్ని టీలు అని ఒక యువకుడు అడగగా వెరై’టీ’ అంటూ నాగార్జున చెబుతారు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అంటూ తెలిపారు నాగార్జున. ఇకపోతే ఎంటర్టైన్మెంట్, గొడవలు, ఫన్ , ఫ్రస్టేషన్, లవ్ అన్నీ 10రెట్లు అంటూ చెప్పిన నాగార్జున ఈ సెట్టింగ్ కోసం పనిచేసిన వారి డీటెయిల్స్ ని కూడా ఈ వీడియోలో విడుదల చేశారు. ఇకపోతే వీడియోలో నాగార్జున ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ చెప్పిన డైలాగ్ అంచనాలు పెంచుతోంది. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 6వ తేదీన రాత్రి 7 గంటలకు గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న ఈ షో ఈసారి ఎలాంటి టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

also read:సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన న్యూటన్స్ థర్డ్ లా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్..

Advertisement

మరొకవైపు బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్లే కంటెస్టెంట్స్ జాబితా ఇదే అంటూ కొంతమంది పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో సీరియల్ నటి దేబ్జానీ, ముఖేష్ గౌడ, సినీ నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్, సినీ నటుడు అదిత్ ఈశ్వరన్, జబర్దస్త్ కమెడియన్ నరేష్, యాంకర్ వర్షిని సౌందరాజన్, కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి ,సీరియల్ నటిమణులు సౌందర్యా రెడ్డి , సుహాసిని , చైత్ర రాయ్ పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×