E-Paper
Advertisement

దేవి ‘ఎల్లమ్మ’ కు హీరోయిన్ కష్టాలు.. సినిమా వాయిదా పడ్డట్లే..?

దేవి ‘ఎల్లమ్మ’ కు హీరోయిన్ కష్టాలు.. సినిమా వాయిదా పడ్డట్లే..?
Advertisement

Yellamma Movie : తెలుగు ప్రేక్షకులను తన సంగీతంతో ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన దేవి ప్రస్తుతం హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.. ఈయన నటిస్తున్న సినిమా ఎల్లమ్మ. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు బలగం సినిమాతో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎంతోమంది హీరోలను పరిశీలించిన వేణు చివరికి డిఎస్పి దగ్గరికి చేరాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రేక్షకులను అలరించిన ఈయన ఇప్పుడు హీరోగా కూడా తన సత్తాను చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. అంతా బాగానే ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లుగా దేవికి హీరోయిన్ కష్టాలు తప్పట్లేదు.? ఈయన పక్కన నటించేందుకు ఇప్పటివరకు హీరోయిన్లు దొరకలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే హీరోయిన్ దొరకట్లేదా? లేదంటే కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారా అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఎల్లమ్మకు హీరోయిన్ కష్టాలు.. 

‘బలగం’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ వేణు ఇప్పుడు మరో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒక పవర్ఫుల్ స్టోరీ ఎల్లమ్మతో ప్రేక్షకులను పలకరించేందుకు వేణు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమాతో దేవి కెరియర్ మరో మైలురాయికి చేరుకుంటుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.. కానీ దేవికి జోడీ దొరకలేదు. ఇటీవల ఒక అమ్మాయి తో స్క్రీన్ టెస్ట్ చేశారు కానీ దేవీ పక్కన ఆమె సెట్ అవ్వలేదనే టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే హీరోయిన్ కొరత ఉందా? ఏ హీరోయిన్ ని దేవికి జోడిగా వేణు తీసుకుని వస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. త్వరలోనే హీరోయిన్ గురించి ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..

ఎల్లమ్మ మూవీ..

Advertisement

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు మరియు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే అంచనాలు పెరిగాయి.. మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవి మొదటిసారి స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా పరిచయం అవడం అందరిని ఆకట్టుకుంటుంది. వేణు సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఈ సినిమాతో దేవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడిపోతుంది అంటూ ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఇటీవలే పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ అలాగే డివోషనల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ కు ఎలాంటి రికార్డులను తెచ్చి పెడుతుందో చూడాలి..

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×