E-Paper
Advertisement

Hyderabad: వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములా.. ఈసారి లోగో వంతు, డిజైన్ చేయండి-లక్ష గెలుచుకోండి

Hyderabad: వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములా.. ఈసారి లోగో వంతు, డిజైన్ చేయండి-లక్ష గెలుచుకోండి
Advertisement

Hyderabad: వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములాను అమలు చేస్తోంది తెలంగాణ హౌసింగ్ బోర్డ్. హైదరాబాద్ సిటీలో ప్రభుత్వం నిర్మిస్తున్న గృహ నిర్మాణ పథకం కోసం మరొక కాంటెస్ట్ మొదలుపెట్టింది. ఈసారి లోగో వంతు వచ్చింది. ఎల్‌ఐజీ గృహ నిర్మాణ పథకం కోసం సరైన లోగో డిజైన్ చేసిన వారికి లక్ష బహుమతి ఇవ్వనుంది.

తెలంగాణ హౌసింగ్ బోర్డ్ మరో కాంటెస్ట్-  హైదరాబాద్‌తోపాటుగా దాని చుట్టుపక్కల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ-క్యూర్ పేరుతో ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ప్రాంతం క్యూర్. అందులో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది తెలంగాణ హౌసింగ్‌ బోర్డు. తక్కువ ఆదాయం కలిగిన వర్గాలకు ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతోంది.

Advertisement

ఈ కొత్త పథకానికి పేరుకు సంబంధించి కాంటెస్ట్ గతంలో ప్రకటించింది. దీనికి 14వేల మంది నుంచి సరైన స్పందన వచ్చిందని హౌసింగ్ బోర్డు వైఎస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. త్వరలో పేరు, విజేతను ప్రకటించి బహుమతి అందజేస్తామని తెలియజేశారు.

లోగో డిజైన్ చేయండి-లక్ష గెలుచుకోండి-తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు మరో బంపరాఫర్ ప్రకటించింది. ఉత్తమ లోగో డిజైన్ చేసినవారికి లక్ష రూపాయలు గెలుచుకునే ఆఫర్ ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జులై 12వ లోపు ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌ (

) ద్వారా తమ లోగో పంపించాలని సూచన చేశారు.

Advertisement

ఈ పోటీలో పాల్గొనడానికి కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి డిజైనర్లు. తొలుత తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఓపెన్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్ బయో-Bio లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఫామ్‌లో మీ వ్యక్తిగత వివరాలను పూర్తి చేయాలి. తయారు చేసిన లోగో డిజైన్‌ను అప్‌లోడ్ చేయాలి. వచ్చిన లోగోలను పరిశీలించి విజేతను నిర్ణయిస్తారు.

ALSO READ: గణేష్ విగ్రహాల.. ఎత్తు కొలతలు ఫిక్స్ చేసిన సీపీ సజ్జనార్.. ఎంతో తెలుసా!

అదృష్ణం వరిస్తే లక్ష గెలుచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. లోగో డిజైన్ కేవలం బొమ్మలా కాకుండా పేద-దిగువ ఆదాయ వర్గాల ప్రజల సొంతింటి కలలను ప్రతిబింబించేలా ఉండాలి. ఆసక్తి ఉన్న క్రియేటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు ప్రకటించిన గడువు లోపు తయారు చేసిన లోగోలను పంపించాలి.

మరోవైపు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ లక్ష ఇళ్ల పథకం కోసం కొందరు తమదైన శైలిలో మాట్లాడుతున్నారు. ఎల్‌ఐజీ ఇళ్లపై ప్రభుత్వం తనదైన శైలిలో ప్రచారం చేస్తోందని అంటున్నారు. దీనికి మంచి ఫలితాలు వస్తే జీహెచ్ఎంసీ అధికార ప్రభుత్వం జెండా ఎగురవేయడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.

Related News

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Big Stories

Advertisement
×