E-Paper
Advertisement

హైవే యాక్సిడెంట్లలో హెల్ప్ చేసేవాళ్ల ప్రాణాలు తీసే పిశాచి… ఇలాంటి హర్రర్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

హైవే యాక్సిడెంట్లలో హెల్ప్ చేసేవాళ్ల ప్రాణాలు తీసే పిశాచి… ఇలాంటి హర్రర్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా
Advertisement

American supernatural horror film : ఒక రోడ్ ట్రిప్‌ను భయానక నైట్‌మేర్‌గా మార్చే ఈ కథ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రోడ్డు ప్రయాణాలపై కొత్త భయం కలిగించే ఈ సినిమా ఆడియో-విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు బలమైన పెర్ఫార్మెన్స్‌లతో మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఆడియన్స్ ను తెగ భయపెడుతోంది. చీకటి రోడ్లపై ఒంటరిగా ప్రయాణం చేసేవారందరూ ఒకసారి చూడాల్సిన థ్రిల్లర్ ఇది.

కథ ఏమిటంటే ?

మ్యాడీ స్వేచ్చగా బతకాలనుకునే యువతి. ఆమెకు నాలుగు గోడల మధ్య జీవితం కంటే, రోడ్డు మీద వ్యాన్ లైఫ్ ఎంతో ఇష్టం. ఆమె ప్రేమికుడు టైలర్ కూడా ఆమెలాగే ఉంటాడు. ఇద్దరూ తమ ఉద్యోగాలు, బాధ్యతలు వదిలేసి, ఒక పెద్ద, సౌకర్యవంతమైన వ్యాన్‌ను కొని అమెరికా దేశమంతా తిరగాలని బయలుదేరుతారు. సూర్యుడు ఉదయం పొడిచినా, చంద్రుడు రాత్రి వెలిగినా వారి ప్రయాణం సంతోషంగా సాగుతోంది. ఒక అందమైన సూర్యాస్తమయ సమయంలో టైలర్ మ్యాడీకి ప్రపోజ్ చేస్తాడు. ఆమె కళ్లు నిండా ఆనందంతో ఒప్పుకుంటుంది. ఇక జీవితం పూర్తిగా ఆనందంగా ఉంది అనుకున్న ఆ క్షణాలు త్వరలోనే భయంకరమైన మలుపు తీసుకుంటాయి.

Advertisement

ఒక దట్టమైన చీకటి రాత్రి, వర్షం కురుస్తున్న హైవే మీద వారు వెళ్తుండగా, ఒక కారు అతి వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు భయంకరంగా ఢి కొడుతుంది. మ్యాడీ-టైలర్ ఇద్దరూ ఆపి సహాయం చేయాలని పరుగెత్తుతారు. కారు డ్రైవర్ లూకాస్ గాయపడి సీటులో కూర్చుని ఉంటాడు. అతను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా… ఏదో ఒక అదృశ్య శక్తి అతన్ని సీటు నుంచి లోపలికి లాగేసి క్రూరంగా చంపేస్తుంది. రక్తపు చీము, భయంకరమైన అరుపులు… ఆ దృశ్యం చూసి జంట గుండెలు ఆగిపోతాయి. వారు వ్యాన్‌లోకి దూకి వేగంగా అక్కడి నుంచి పారిపోతారు. మరుసటి ఉదయం వ్యాన్ మీద మూడు పెద్ద గోళ్ల గీతలు కనిపిస్తాయి. లూకాస్ కారు మీద కూడా అదే గుర్తులు ఉన్నాయని తెలిసి వారికి భయం పట్టుకుంటుంది.

ఇక చీకటి పడగానే వ్యాన్ లోపల ఏదో కదులుతున్నట్టు, గీతలు గీసే శబ్దాలు, భయంకరమైన గొంతుకలు వినిపిండం మొదలవుతుంది. ‘ది ప్యాసింజర్’ అని పిలవబడే ఈ రోడ్‌సైడ్ డెమోన్ హైవేలపై ప్రమాదాల్లో చిక్కుకున్నవారికి సహాయం చేయడానికి ఆగినవారిని అదును చూసుకుని వారి వాహనంలోకి ఎక్కి వెంటాడుతుంది. ఒకసారి ఎక్కితే చీకటి పడిన ప్రతి రాత్రి దాని వేట మొదలవుతుంది. ఈ ప్రయాణంలో వారికి డయానా అనే పర్యాటకురాలు కలుస్తుంది. ఆమెకు ఈ దెయ్యం గురించి బాగా తెలుసు. “ఈ దెయ్యం రోడ్డు మీద సహాయం చేసే మనసున్నవారినే టార్గెట్ చేస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే సాధారణ మ్యాపుల్లో కనిపించని ఒక పురాతన చర్చికి వెళ్లాలి. ప్రయాణీకుల రక్షకుడైన ఆ పవిత్ర స్థలంలో మాత్రమే ఈ రాక్షసుడు బలహీనపడతాడని ఆమె వాళ్ళకు హెచ్చరిక చేస్తుంది.

Advertisement

ఇక కథ ముందుకు సాగేకొద్దీ టెన్షన్ పెరుగుతుంది. డయానాను కూడా దెయ్యం క్రూరంగా చంపేస్తుంది. టైలర్ కాలు వ్యాన్ కింద నలిగిపోయి తీవ్ర గాయాలపాలవుతాడు. మ్యాడీని దెయ్యం ఎత్తుకెళ్తుంది. ఇక క్లైమాక్స్ ప్యాంట్లు కూడా తడిచిపోతాయి. ఇంతకీ వీళ్ళు ఆ చర్చిలోకి వెళ్తారా ? అ దెయ్యం నుంచి బయట పడతారా ? అసలు ఆ దెయ్యం సాయం చేసేవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తోంది ? అనేది సినిమా చూసి తెలుసుకోండి.

Amazon Prime Videoలో స్ట్రీమింగ్

ఈ హాలీవుడ్ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం Passenger (2026) ఇప్పుడు Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆండ్రే ఓవ్రేడాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రాత్రి రోడ్లపై ప్రయాణించే వారందరికీ ఒక హెచ్చరికగా నిలుస్తుంది. తెలుగు డబ్బింగ్ లేకపోయినా, ఇంగ్లీష్ ఒరిజినల్‌తో సబ్‌టైటిల్స్ ఉన్నాయి.

Read Also : నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్

Related News

పెళ్లి కాకుండానే చచ్చి దెయ్యంగా… అబ్బాయిలు కన్పిస్తే వదలని ఆడ పిశాచి

అడవిని డెడ్లీ డెత్ గేమ్ లా మార్చే సైకో… టూరిస్టులను టార్చర్ చేసి చంపే కిల్లర్

మనుషుల బ్రెయిన్ ను మటన్ లా తినేసే మాన్స్టర్స్… ఈ కొరియన్ సై-ఫై సిరీస్ లో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటది భయ్యా

ఘోస్ట్ షిప్లో వెంటాడి వెంటాడి చంపే మాస్క్ కిల్లర్… టెర్రీఫయింగ్ టైమ్ లూప్ సైకలాజికల్ థ్రిల్లర్

అనాథాశ్రమం అమ్మాయిలను బలిచ్చే వార్డెన్… తినేటప్పుడు మాత్రం ఈ మూవీని అస్సలు చూడొద్దు

జంటలుగా ప్రైవేట్ పార్టీ… పేరెంట్స్ ఎంట్రీతో పిచ్చెక్కించే ట్విస్ట్

నడిచే పిచ్చాసుపత్రి వీడు… సింగిల్ చింతకాయలకు ఫుల్ ఫన్

Big Stories

Advertisement
×