E-Paper
Advertisement

కాళేశ్వరం కాదు.. అది ‘డ్రామేశ్వరం’! కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రాంచందర్ రావు హాట్ కామెంట్స్

కాళేశ్వరం కాదు.. అది ‘డ్రామేశ్వరం’! కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రాంచందర్ రావు హాట్ కామెంట్స్
Advertisement

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నష్టాల్లోకి నెట్టేస్తే.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే ఆ సంస్థను బలోపేతం చేస్తూ కాపాడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో ప్రస్తుతం 39 వర్కింగ్ మైన్స్ ఉండగా.. 31 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, 41 వేల మంది శాశ్వత ఉద్యోగులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేశారు.

కిషన్ రెడ్డికి ధన్యవాదాలు

Advertisement

ఈ తరుణంలో సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల-II బొగ్గు బ్లాక్‌ను కేటాయించడంపై తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ బ్లాక్ ద్వారా సింగరేణి సంస్థకు రూ.64,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుందని, అలాగే దాదాపు 1,200 మంది నిరుద్యోగ యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ బ్లాక్ కేటాయింపుతో కేవలం సింగరేణి అభివృద్ధితో పాటు, తెలంగాణ భవిష్యత్తును కూడా కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందని కొనియాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వంప రాంచందర్ రావు ఫైర్

Advertisement

తాడిచర్ల-II బొగ్గు బ్లాక్‌ను తమ ప్రయత్నాల వల్లే సాధించుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం పూర్తిగా అవాస్తవమని రాంచందర్ రావు మండిపడ్డారు. గతంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి ఎందుకు కేటాయించలేకపోయారో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బ్లాక్ కేటాయింపు అనేది కేవలం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమిష్టి కృషితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల మాత్రమే సాధ్యమైందని స్పష్టం చేశారు.

Also Read: కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంప ఆరోపణలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని తమ సొంత ప్రయోజనాల కోసమే వాడుకోగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా సింగరేణి నిధులను ఫుట్‌బాల్ మ్యాచ్‌ల వంటి ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ సంస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశవ్యాప్తంగా బొగ్గు కేటాయింపుల్లో పెద్ద ఎత్తున కోల్ స్కాం వెలుగుచూసిందని, కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, పారదర్శకతకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఫలితంగానే నేడు కోల్ ఇండియా ద్వారా బొగ్గు ఉత్పత్తి సుమారు 70 శాతం పెరిగిందని, తద్వారా దేశానికి బొగ్గు రంగం నుండి దాదాపు రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోందని వివరించారు.

సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే..

రాష్ట్రంలో భూపరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో భారీగా ఫేక్ అకౌంట్లు సృష్టించబడ్డాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని రాంచందర్ రావు పట్టుబట్టారు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే సుమారు 2 వేల ఫేక్ అకౌంట్లు వెలుగుచూడటం తీవ్ర ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధరణిపై విచారణ జరుపుతున్న సిట్ పరిధిని వెంటనే విస్తరించాలని, ప్రస్తుతం భూభారతిలో జరుగుతున్న విచ్చలవిడి అవకతవకలపైనా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Also Read: ఈ రాత్రికే ఇరాన్‌పై దాడులు చేస్తా.. ట్రంప్ సంచలన హెచ్చరిక!

అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..

భూభారతి అవినీతిలో భాగస్వాములైన రాజకీయ నాయకులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ధరణి, భూభారతి పోర్టల్స్‌లో జరిగిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. భూముల విషయంలో జరిగిన అవకతవకలు బయటపడుతున్న నేపథ్యంలోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, మేడిగడ్డ అంశాలను మళ్లీ మళ్లీ తెరపైకి తెస్తూ డ్రామాలాడాలని చూస్తోందని, కాళేశ్వరాన్ని కాస్తా డ్రామేశ్వరంగా మారుస్తున్నారని విమర్శించారు.

అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు..

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపించాలని రాష్ట్రంలో మొట్టమొదట డిమాండ్ చేసింది బీజేపీయేనని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలని హితవు పలికారు. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి, రైతులకు సాగునీరు అందించి ఉపయోగపడేలా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో చౌకబారు రాజకీయాలు చేయొద్దని, అన్నదాతలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాంచందర్ రావు తీవ్రంగా హెచ్చరించారు.

Also Read: నీకు కేసీఆర్ అవసరమా.. నేను చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు ఓపెన్ చాలెంజ్!

Related News

Ganesh Idols: గణేష్ విగ్రహాల.. ఎత్తు కొలతలు ఫిక్స్ చేసిన సీపీ సజ్జనార్.. ఎంతో తెలుసా!

Harish Rao: నీకు కేసీఆర్ అవసరమా.. నేను చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు ఓపెన్ చాలెంజ్!

Minor Driving: రవాణా శాఖలో తెలంగాణ సర్కార్ సంచలన జీవో.. కొత్తగా తెచ్చిన రూల్స్ ఇవే..?

Telangana Economy: ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్‌తో.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

NIA Raids: ఎన్​ఐఏ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. ఉగ్రసంస్థలతో హైదరాబాద్ మహిళకు లింక్..?

Kollapur Principal: టీసీ కోసం వస్తే కోరిక తీర్చాలంటూ.. యువకుడిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్!

టీవీ షో కోసం వస్తే.. ఇంత ఘోరమా? హైదరాబాద్‌లో మహిళపై దారుణం!

Big Stories

Advertisement
×