E-Paper
Advertisement

పెళ్లి కాకుండానే చచ్చి దెయ్యంగా… అబ్బాయిలు కన్పిస్తే వదలని ఆడ పిశాచి

పెళ్లి కాకుండానే చచ్చి దెయ్యంగా… అబ్బాయిలు కన్పిస్తే వదలని ఆడ పిశాచి
Advertisement

Korean Comedy Thriller: పెళ్లి కాకుండా చచ్చి, దెయ్యమైతే ఆ ఆడ దెయ్యం ఏం చేస్తుంది ? అబ్బాయిలతో ఎలా ఆడుకుంటుంది ? కన్యత్వం పోతేనే ముక్తి అని నమ్మే ఆ దెయ్యం అబ్బాయిలు కనిపిస్తే ఏం చేసింది ? అనేది తెలియాలంటే ఈ కొరియన్ సిరీస్ ను చూడాల్సిందే. దక్షిణ కొరియా సిరీస్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ ‘Oh My Ghost’. 2015లో విడుదలైన ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

కథలోకి వెళ్తే…

నా బోంగ్-సున్ ఈ సినిమాలో హీరోయిన్ పేరు. ఆమె అమాయకమైన, సిగ్గుపడే అమ్మాయి. ఒక ప్రముఖ రెస్టారెంట్‌ లో అసిస్టెంట్ కుక్‌ గా పని చేస్తుంది. ఆమె పని మీద ఎంతో అంకితభావం ఉంటుంది. కానీ, తన బాస్ అయిన స్టార్ చెఫ్ కాంగ్ సున్-వూ ముందు మాటలు రావు. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక విచిత్రమైన శక్తి ఉంటుంది. అదేంటంటే… ఆమెకు దెయ్యాలు కనిపిస్తాయి. ఈ భయం వల్ల ఆమె ఎప్పుడూ ఒంటరిగా, భయపడుతూ జీవితం గడుపుతుంది.

Advertisement

అటు షిన్ సూన్-ఏ అనే ఆడ దెయ్యం తిరుగుతుంది. ఆమె స్వర్గానికి వెళ్లాలంటే ఒక్క షరతు ఉంటుంది. పెళ్లి కాకుండానే చనిపోయి దెయ్యంగా మారిన ఆ అమ్మాయి ఒక మగాడిని నిజంగా ప్రేమించి, ఆ కోరిక తీర్చుకోవాలి. ఆమె “కన్య దెయ్యం” కావడం వల్ల ఇంకా భూమి మీదే తిరుగుతోంది. ఒక రోజు తనకు సరైన వ్యక్తిని వెతుకుతూ బోంగ్-సున్ శరీరంలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి సిరీస్ లో అసలైన ఆట మొదలవుతుంది.

దెయ్యం లోపలికి రాగానే బోంగ్-సున్ పూర్తిగా మారిపోతుంది. సిగ్గుపడే అమ్మాయి ఒక్కసారిగా బోల్డ్ గా, అల్లరి గా మారిపోతుంది. రెస్టారెంట్ కిచెన్‌ లోనే తన క్రష్ సున్-వూను లైన్‌ లో పెట్టడం, ఫ్లర్ట్ చేయడం, ధైర్యంగా అతని ముందు నిలబడడం వంటివి చేస్తుంది. ఇవన్నీ చూసి సున్-వూ మొదట షాక్ అవుతాడు. కానీ నెమ్మదిగా ఆమెలోని ఈ కొత్త ఎనర్జీ, నిజాయితీ అతన్ని ఆకర్షిస్తుంది. వంటలు చేస్తూ, రెస్టారెంట్‌ లో రొటీన్ జీవితంలో జరిగే ఈ రొమాన్స్ చాలా సరదాగా, కామెడీగా సాగుతుంది. బోంగ్-సున్ శరీరాన్ని కంట్రోల్ చేస్తున్న సూన్-ఏ తన కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.

Advertisement

కానీ కథ ఇక్కడే ట్విస్ట్ తీసుకుంటుంది. సూన్-ఏకు తన మరణం గురించి నిజం తెలుస్తుంది. ఆమె ప్రమాదంలో చనిపోలేదు. హత్యకు గురైంది. ఆ హంతకుడు మరెవరో కాదు, సున్-వూకు బావ అయిన పోలీస్ ఆఫీసర్ చోయ్ సుంగ్-జే. బయటకు మంచి వ్యక్తిగా కనిపించే సుంగ్-జే శరీరాన్ని ఒక దుష్ట శక్తి ఆవహిస్తుంది. గతంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసును సూన్-ఏ చూడడం వల్లే ఆమెను గొంతు పిసికి చంపాడు. ఇక్కడి నుంచి సిరీస్ రొమాంటిక్ కామెడీ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారిపోతుంది.

బోంగ్-సున్, సూన్-ఏ, సున్-వూ కలిసి ఈ క్రూరమైన సత్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దీంతో కథ తీవ్రమైన క్లైమాక్స్‌కు దారి తీస్తాయి. సుంగ్-జే నేరాలు బయట పడకుండా ఉండడానికి ఏం చేశాడు ? సూన్-ఏ తన ప్రతీకారం ఎలా తీర్చుకుంది ? ఆమె స్వర్గానికి వెళ్లిందా ? బోంగ్-సున్ పరిస్థితి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

రెండు ఓటీటీలలో

‘ఓ మై ఘోస్ట్’ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీరు లైట్ హార్టెడ్ ఫాంటసీ కావాలనుకున్నా, మంచి ఫీల్-గుడ్ స్టోరీ చూడాలనుకున్నా ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్. ఒకసారి మొదలుపెడితే 16 ఎపిసోడ్‌లు కూడా తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో Amazon miniTV, Amazon MX Playerలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ లేకపోయినా, హిందీ, కొరియన్, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. హృదయాన్ని కదిలించే ఈ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్ ను డోంట్ మిస్.

Read Also : ఇండియన్ మైథాలాజి మిక్సయ్యి ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ… లాస్ట్ ట్విస్ట్ డోంట్ మిస్

Related News

వరుస మర్డర్స్ తో పోలీసులను పరుగులు పెట్టించే సైకో… రియల్ సీరియల్ కిల్లర్ కథ

హైవే యాక్సిడెంట్లలో హెల్ప్ చేసేవాళ్ల ప్రాణాలు తీసే పిశాచి… ఇలాంటి హర్రర్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

అడవిని డెడ్లీ డెత్ గేమ్ లా మార్చే సైకో… టూరిస్టులను టార్చర్ చేసి చంపే కిల్లర్

మనుషుల బ్రెయిన్ ను మటన్ లా తినేసే మాన్స్టర్స్… ఈ కొరియన్ సై-ఫై సిరీస్ లో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటది భయ్యా

ఘోస్ట్ షిప్లో వెంటాడి వెంటాడి చంపే మాస్క్ కిల్లర్… టెర్రీఫయింగ్ టైమ్ లూప్ సైకలాజికల్ థ్రిల్లర్

అనాథాశ్రమం అమ్మాయిలను బలిచ్చే వార్డెన్… తినేటప్పుడు మాత్రం ఈ మూవీని అస్సలు చూడొద్దు

జంటలుగా ప్రైవేట్ పార్టీ… పేరెంట్స్ ఎంట్రీతో పిచ్చెక్కించే ట్విస్ట్

Big Stories

Advertisement
×