E-Paper
Advertisement

NIA Raids: ఎన్​ఐఏ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. ఉగ్రసంస్థలతో హైదరాబాద్ మహిళకు లింక్..?

NIA Raids: ఎన్​ఐఏ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. ఉగ్రసంస్థలతో హైదరాబాద్ మహిళకు లింక్..?
Advertisement

NIA Raids: స్వేచ్ఛ బ్యూరో: ఆన్​ లైన్​ టెర్రర్​ రాడికలైజేషన్​ నెట్​ వర్క్​ కేసులో ఎన్​ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుఝాము నుంచే విజయవాడ వించిపేట పరిసర ప్రాంతాల్లో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు జరిపారు. ఈ ముగ్గురికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? గతంలో వాళ్లు తిరిగిన ప్రాంతాల్లోని డిజిటల్​ ఆధారాలు, కమ్యూనికేషన్​ డివైస్​ లు, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించారు. దాంతోపాటు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్ర కుట్రలు..

విజయవాడకు చెందిన మహ్మద్​ రహమతుల్లా షరీఫ్​ సోషల్ మీడియా వేదికల ద్వారా జిహాదీ కంటెంట్​ ను ప్రచారం చేస్తున్నట్టు గుర్తించిన విజయవాడ టూ టౌన్​ పోలీసులు మార్చి 22న అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. అతన్ని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల మేరకు భవానీపురానికి చెందిన మహ్మద్​ డానిష్​, మహంతిపురం నివాసి మీర్జా సొహైల్​ బేగ్​ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ చంచల్ గూడ ప్రాంతంలో ఉంటున్న సయీదా బేగం ఆన్​ లైన్​ ద్వారా రిక్రూట్ మెంట్లు జరుపుతున్నట్టు నిర్ధారించుకుని ఆమెను కూడా అరెస్ట్​ చేశారు. వీరి నెట్ వర్క్​ తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, వెస్ట్​ బెంగాల్​, బీహార్​, రాజస్థాన్​ రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు వెల్లడైన నేపథ్యంలో మే 13న ఎన్​ఐఏ అధికారులు కేసులు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

Advertisement

Also Read: Notary Plot: తక్కువ ధరకి వస్తుందని నోటరీ ప్లాట్లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

నిషేధిత ఉగ్ర సంస్థలు..

ఈ క్రమంలో 13మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 12మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులు రాజమహేంద్రవరం సెంట్రల్​ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిని జరిపిన విచారణలో నిందితులు అల్​ మాలిక్​ యూత్ ఇస్లామిక్​ కమిటీ (ఏఎంవైఐసీ) పేరుతో సోషల్​ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసి యువతను ఉగ్రవాదం బాటలోకి నడిపించేందుకు నిషేధిత ఉగ్ర సంస్థలైన ఐఎస్ఐఎస్​, ఏక్యూఐఎస్​ జిహాదీ వీడియోలను ప్రచారం చేశారు. ఇన్​ స్టాగ్రాం ద్వారా అల్ హకీం షుకూర్​ అనే హ్యాండ్లర్​ తో సంబంధాలు సాగిస్తూ ఆన్​ లైన్​ లో పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలన్న దానిపై సమాచారాన్ని కూడా సేకరించారు. ఇదే కేసులో ఎన్​ఐఏ అధికారులు బుధవారం బీహార్​, రాజస్థాన్​, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లో కూడా సోదాలు జరిపినట్టు సమాచారం.

Advertisement

Also read: Homemade Wine: యూట్యూబ్ చూసి వైన్ తయారీ.. ఏకంగా 377 లీటర్లు, చివరికి ఎలా దొరికిపోయారంటే?

Related News

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

Big Stories

Advertisement
×