E-Paper
Advertisement

Rah Veer Scheme: రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు సర్కార్ కీలక నిర్ణయం..?

Rah Veer Scheme: రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు సర్కార్ కీలక నిర్ణయం..?
Advertisement

Rah Veer Scheme: స్వేఛ్చ బ్యూరో: రోడ్డు ప్రమాదాలతో జరిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన రహ వీర్ పథకాన్ని తెలంగాణ లో సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో రవాణాశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకంతో రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం చేసి ప్రాణాలను కాపాడిన సాధారణ పౌరులను ప్రోత్సహించి గౌరవించనుంది. అంతేకాదు పథకం కింద ఆర్థికప్రోత్సాహంతో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి సకాలంలో రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రుల్లో చేర్పించినవారిని గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేయనున్నారు.

ముందుకు వచ్చి సహాయం

గతేడాది 24,826 రోడ్డు ప్రమాదాలు జరుగగా 6499 మంది మృతి చెందగా, 14,768 మంది గాయపడ్డారు. 2024లో 23491 రోడ్డు ప్రమాదాలు జరుగగా 7056 మంది మృతి చెందగా, 21,664 మంది గాయపడ్డారు. అయితే ప్రమాదాల నివారణకు రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనవరి నెల మొత్తం రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. అదే విధంగా పోలీశాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రమాద సమయంలో భయపడకుండా ముందుకు వచ్చి సహాయం చేసిన వ్యక్తి వల్ల ఒక ప్రాణం కాపాడుతుండటంతో అటువంటి వ్యక్తులను ‘రహ వీర్’గా గుర్తించి ప్రభుత్వం సత్కరిస్తుందని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. రహవీర్ పథకంతో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా ప్రోత్సహించడం, సాధారణ పౌరులు భయపడకుండా ముందుకు వచ్చి సహాయం చేసే వాతావరణం కల్పించడం, గుడ్ సమారిటన్‌లకు చట్టపరమైన రక్షణ కల్పించనున్నారు.

25వేల నగదు ప్రోత్సాహం

Advertisement

రహవీర్ పథకం కింద ప్రమాద బాధితుడి ప్రాణాలను కాపాడిన ప్రతి వ్యక్తికి రూ.25వేల నగదు అందజేయనున్నారు. అదే విధంగా ప్రభుత్వ ప్రశంసా పత్రం అందజేసి సత్కరిస్తారు. జిల్లా కమిటీ ఏర్పాటు వివరాలు, ఎంపిక విధానంతో పాటు ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని రవాణా శాఖ జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది.

‘రహవీర్’ ఎంపిక విధానం

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి సహాయం చేసి ఆసుపత్రికి తరలించిన వ్యక్తి వివరాలు. సంబంధిత పోలీసు అధికారి(ఎస్హెచ్ఓ). ఆసుపత్రి అధికారులతో వ్యక్తి వివరాలు నమోదు. ఆ పోలీస్ అధికారి జిల్లా కమిటీ కి సిఫార్స్ చేయాలి. పోలీస్ అధికారి సిఫార్సు ఆధారంగా జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం అర్హులైన వ్యక్తులను “రహ వీర్”గా ఎంపిక చేస్తారు. రహ వీర్ వివరాలను జిల్లా కమిటీ రవాణా కమిషనర్ కు పంపించడం జరుగుతుంది. ఎంపికైన రహవీర్లకు 25వేలనగదు బహుమతి, ప్రశంసా పత్రం రవాణా శాఖ ద్వారా అందజేస్తారు.

Advertisement

Also Read: Extra Mile Awards: నగర చరిత్రలో ఇదో మైలురాయి.. పోలీసులకు ఎక్స్ ట్రా మైల్ పురస్కారాలు

జిల్లా కమిటీ

రహవీర్ పథకానికి అర్హులను ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ వేయనున్నారు. ఈ కమిటీలో ఛైర్మన్ గా జిల్లా కలెక్టర్, మెంబర్లు గా ఎస్పీ, జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, కన్వీనర్ గాజిల్లా రవాణా శాఖ అధికారి ఉంటారు.

గుడ్ సమారిటన్‌కు చట్టపరమైన రక్షణ

సహాయం చేసిన వ్యక్తిని పోలీసు విచారణలు లేదా కోర్టు ప్రక్రియల పేరుతో వేధించొద్దని రవాణాశాఖ జారీ చేసిన సర్క్యూలర్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సహాయం అందించాలి. గుడ్ సమారిటన్‌కు పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందనిసుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి.

భయపడకుండా సాయం చేయాలి

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చూస్తూ ఉండకుండా, భయపడకుండా ముందుకు వచ్చి సహాయం చేయాలి. ఒక చిన్న సహాయం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. సహాయం చేసినవారికి ప్రభుత్వం పూర్తి రక్షణతో పాటు గౌరవం కల్పిస్తుంది.రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశంతో రహవీర్ పథకాన్ని ప్రజలందరూ తెలుసుకొని వినియోగించుకోవాలని రవాణాశాఖ కమిషనర్ ఇలంబరితి అన్నారు.

అవగాహన కార్యక్రమాలు

=ఐటీ, ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషన్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్
రోడ్డు ప్రమాదాల నివారణ నివారణకు ప్రతి ఏటా జనవరిలో మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వంఆదేశాలతో రవాణాశాఖ ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్కూళ్లలో సైతం ట్రాఫిక్ అవేర్ నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించినవారికి రహవీర్ పథకం కింద 25వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు జిల్లాలో పథకం కింద ఎంపిక కోసం కలెక్టర్ చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాణాలు కాపాడిన వ్యక్తిని సత్కరించనున్నామని, ఐటీ, ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషన్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.

Also Read: Road Accident: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్ లో 15 మంది

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×