E-Paper
Advertisement

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొని డిగ్రీ విద్యార్థి మృతి

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొని డిగ్రీ విద్యార్థి మృతి
Advertisement

Medchal Accident: స్వేచ్ఛ బ్యూరో: జీనోమ్‌ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మజీద్‌పూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (20) హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చిన అతడు గురువారం రాత్రి తాళ్లపేట నుంచి లక్షెట్టిపేటకు వెళ్లి తన స్నేహితుడు సిద్ధును కలిశాడు. అనంతరం ఇద్దరూ సిద్ధుకు చెందిన ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో మజీద్‌పూర్‌లోని మారుతి షోరూం ఎదుటకు చేరుకోగానే, ముందు వెళ్తున్న గుర్తుతెలియని ట్రక్కు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న బైక్‌ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న నవీన్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న సిద్ధుకు గాయాలయ్యాయి.

Advertisement

క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి రమేష్‌ ఫిర్యాదు మేరకు జీనోమ్‌ వ్యాలీ పోలీసులు గుర్తుతెలియని ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

Also Read: 12 ఏళ్ల తర్వాత రాజమండ్రి నగర పోరు.. కూటమి జోరుకు వైసీపీ చెక్ పెడుతుందా?

Tags

Related News

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల

కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్!

హైదరాబాద్ ‘డిజిటల్ అరెస్ట్’ మరణం కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?

హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!

జీహెచ్ఎంసీకి ఏమైంది? ఆదాయం లేకపోయినా ఆ రెండు కార్పొరేషన్ల భారం ఎందుకు?

విద్యుత్ శాఖలో మీటర్ బైపాస్ కుంభకోణం.. జోరుగా డబ్బులు వసూల్!

Big Stories

Advertisement
×