E-Paper
Advertisement

20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Heartland OTT: ఆస్కార్ అవార్డు విజేత జెస్సికా చాస్టెయిన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త మ్యూజిక్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హార్ట్‌ల్యాండ్’ (Heartland). ‘Country Strong’ వంటి మ్యూజికల్ డ్రామాతో గుర్తింపు తెచ్చుకున్న షానా ఫెస్టే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 13 నుంచి Netflixలో ట్రెండింగ్ అవుతోంది. అమెరికాలోని కంట్రీ మ్యూజిక్‌కు ప్రసిద్ధి చెందిన నాష్‌విల్లే నగరం నేపథ్యంలో సాగే ఈ కథలో సంగీతం, మిస్సింగ్ కేసు, మర్డర్ మిస్టరీ, మ్యూజిక్ ఇండస్ట్రీలోని చీకటి వ్యవహారాలు కలగలిసి ఉంటాయి. ఇందులో జెస్సికా చాస్టెయిన్ స్వయంగా పాడిన పాటలు కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.  ఇప్పుడు ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మిస్టీ జోన్స్ (జెస్సికా చాస్టెయిన్) ఒకప్పుడు కంట్రీ మ్యూజిక్ ప్రపంచాన్ని ఏలిన స్టార్ సింగర్. అయితే కొన్ని వివాదాలు, వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె సంగీత ప్రపంచానికి దూరమై దాదాపు 20 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తుంటుంది. అలాంటి సమయంలో ఆమె మేనకోడలు చార్లీ హార్ట్ (కార్టర్ ఫెయిత్) కనిపించకుండా పోతుంది. చార్లీ కూడా సంగీత ప్రపంచంలో ఎదుగుతున్న యువ గాయని కావడంతో ఆమె అదృశ్యం పెద్ద చర్చకు దారితీస్తుంది. పోలీసులు ఈ కేసును పెద్దగా పట్టించుకోకపోవడంతో మిస్టీనే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తన పాత ఊరు నాష్‌విల్లేకు తిరిగొచ్చి మేనకోడలి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెడుతుంది.

Advertisement

ఈ క్రమంలో చార్లీ బాయ్‌ఫ్రెండ్ జేస్ (రాస్ లించ్), ఆమె మేనేజర్ రాయ్ కాంబ్స్ (గారెట్ హెడ్‌లండ్) సహా పలువురిపై అనుమానం కలుగుతుంది. ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్లే కొద్దీ సంగీత ప్రపంచం వెనుక దాగి ఉన్న దోపిడీ, మోసాలు, అవినీతి వ్యవహారాలు బయటపడతాయి. అసలు చార్లీకి ఏమైంది?  మిస్టీ మేనకోడలిని కాపాడగలిగిందా? ఆమె మిస్సింగ్ వెనుక లవ్ స్టోరీ ఉందా ? అనేదే ఈ సినిమా అసలు కథ. ఇందులో జెస్సికా చాస్టెయిన్ మిస్టీ పాత్రలో తన నటనతో పాటు పాటలతోనూ ఆకట్టుకుంటారు.  ఎమోషన్స్‌తో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సంగీతం కలిసిన కథలను ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు.

తెలుగులో చూడవచ్చు 

ఈ సినిమాలో మిస్టీ జోన్స్‌గా జెస్సికా చాస్టెయిన్, రాయ్ కాంబ్స్‌గా గారెట్ హెడ్‌లండ్, చార్లీ హార్ట్‌గా కంట్రీ సింగర్ కార్టర్ ఫెయిత్, జేస్‌గా రాస్ లించ్ నటించారు.  షానా ఫెస్టే దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. 2026లో విడుదలైన ఈ ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ నవంబర్ 13 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. భారతదేశంలో ఇంగ్లీష్ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ ఆడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. సినిమా నిడివి 1 గంట 52 నిమిషాలు.

Advertisement

Read Also: ఇదెక్కడి కొరియన్ థ్రిల్లర్రా సామీ… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది… చావాలనుకుంటే ఈ సిరీస్ ను చూడండి

Tags

Related News

గడ్డకట్టిన సరస్సులో స్టూడెంట్ శవం.. హంతకుడి వేటలో కవల సోదరి.. ఓటీటీలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ

40 ఏళ్ల బ్యాచిలర్ ఇంట్లోకి అందమైన యువతి ఎంట్రీ.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘పరివారిక్ మనోరంజన్’!

దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు… ప్రతి క్షణం ఉత్కంఠ.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తెరవెనుక గ్లామర్ తారల చీకటి దందాలు… ఓ హీరోయిన్ సూసైడ్ వెనుక ఇంత పెద్ద మాఫియా కథా?

లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా

రణబాలిగా ఓటీటీలో విజయ్ దేవరకొండ ఊచకోత షురూ… ఈ రేంజ్ వైలెన్స్ ఎప్పుడైనా చూశారా?

Big Stories

Advertisement
×