TET Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ నోటిఫికేషన్‌ను స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 15 వరకు జరగనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఏడాదికి కనీసం రెండు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ను రాష్ట్ర విద్యా శాఖ నిర్వహిస్తుంది.
అయితే నవంబర్ 16 నుంచి డిసెంబర్ 10 వరకు టెట్ 2027 కు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్లైన్ మోడ్‌లో ఈ టెట్ పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. టెట్ పరీక్షను D. Ed, B. ED, క్వాలిఫై అభ్యర్థులు, లాంగ్వేజ్ పండిట్లు , ఫైనల్ ఇయర్ విద్యార్థులు రాయనున్నారు.
ఈ పరీక్షను మోత్తం పేపర్ 1, పేపర్ 2 గా టెట్ నిర్వహించనున్నారు.పరీక్ష అనంతరం వచ్చే ఎడాదిలోనే ఫిబ్రవరి 8 నుంచి అదే నెల 12 మధ్య టెట్ ఫలితాలు విడుదల కానున్నాయని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఊపాద్యాయ వృత్తిలోకి రావాలనుకున్న ప్రతి వ్యక్తికి ఇదో మంచి అవకాశంగా మనం ఈ పరీక్షను చూడవచ్చు.
Also read: ఏపీలో రూ.1.20 లక్షల కోట్లతో రహదారి ప్రాజెక్టులు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ