E-Paper
Advertisement

రాష్ట్రంలో ఐటీఐ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. కనీస వయస్సు..!

రాష్ట్రంలో ఐటీఐ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. కనీస వయస్సు..!
Advertisement

ITI Admissions: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఆగస్టు సెషన్ ప్రవేశాల కోసం ఉపాధి, శిక్షణ శాఖ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశాలు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ), ప్రభుత్వ ఐటీఐలు, మైనారిటీ ఐటీఐలు, ప్రైవేట్ ఐటీఐలలో ఎన్సీవీటీ నిబంధనల ప్రకారం నిర్వహించబడతాయి. అభ్యర్థులు ట్రేడ్‌ను బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆగస్టు 1, 2026 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 14 ఏళ్లు నిండి ఉండాలి.

కనీస వయస్సు..

అయితే, డ్రోన్ టెక్నీషియన్ కోర్సు కోసం కనీస వయస్సు 16 ఏళ్లుగా నిర్ణయించారు. దీనికి గరిష్ట వయోపరిమితి లేదు. ఆన్‌లైన్ ద్వారా రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఈనెల 14 నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iti.telangana.gov.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లను హై-క్లారిటీతో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

Also read: తెలంగాణకు బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

రిజర్వేషన్ ఆధారంగా..

ఎంపికైన అభ్యర్థులకు సీట్ల కేటాయింపు మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా జరుగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీలు ఎస్ఎస్‌సీ మెమోలో ఉన్న విధంగానే ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. దరఖాస్తులో సమర్పించిన మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ కోర్సు పూర్తయ్యే వరకు మార్చకూడదని అధికారులు సూచించారు.

Advertisement

Also read: బిగ్ బ్రేకింగ్.. ప్రధాని మోదీ షెడ్యూల్లో మార్పులు

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×