E-Paper
Advertisement

TG Health Mission: వచ్చే నెల మార్చి 2 నుంచి ఇక సమరమే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ సంచలన నిర్ణయం..?

TG Health Mission: వచ్చే నెల మార్చి 2 నుంచి ఇక సమరమే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ సంచలన నిర్ణయం..?
Advertisement

TG Health Mission: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘విజన్ 2047’ పాలసీలో భాగంగా ఒక ప్రతిష్టాత్మక అడుగు వేసింది. 2 మార్చి 2026 నుండి 9 జూన్ 2026 వరకు 100 రోజుల పాటు కొనసాగే “హెల్త్ మిషన్-100” ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాధి నివారణ, ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటూ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ ముందుకు సాగుతుంది. ఈ మేరకు వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను గురువారం ప్రకటించింది. ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో నాణ్యతను మెరుగుపరచడం తో పాటు వ్యవస్థాగత మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని ఆఫీసర్లు తెలిపారు.

లక్ష్యాలు ఇవే..

ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్స్ ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యత ఆడిట్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్, పారిశుధ్యం , బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న లోపాలను గుర్తించి సరిచేయనున్నారు.దీంతో పాటు రాష్ట్రంలోని దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల కు మహిళలకు 30 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహించి,డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించనున్నారు. మాతా శిశు, కౌమార ,వృద్ధుల ఆరోగ్యంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టనున్నారు. వృద్ధుల సంరక్షణ కొరకు 33 జిల్లాల జనరల్ ఆసుపత్రులలో ప్రత్యేక జెరియాట్రిక్ క్యాంపులు నిర్వహించనున్నారు. మహిళా ఆరోగ్య సంరక్షణకు రక్తహీనత స్క్రీనింగ్, ప్రసవం తర్వాత 14 రోజుల్లోగా హోమ్ విజిట్స్ , మెన్స్ట్రువల్ హైజీన్ పై అవగాహన కల్పించనున్నారు. పాఠశాల విద్యార్థులు కోసం ఆర్ బీఎస్ కే ద్వారా కంటి పరీక్షలు, పోషకాహార లోపాల గుర్తింపు, సీపీఆర్ వంటి ప్రాణ రక్షణ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇక నూతన క్యాన్సర్ కేర్ పాలసీ లాంచ్ చేయడంతో పాటు క్యాన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక డయాబెటిస్, హైపర్ టెన్షన్ , క్షేత్రస్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించనున్నారు.

Advertisement

Also Read: TG Temple Lands: సరిహద్దుల్లో ఉన్న దేవాదాయ భూమి పై సర్కార్ కీలక నిర్ణయం.. వాటితో నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?

టీబీ ముక్త తెలంగాణ..

టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడం ,వారికి పోషకాహార మద్దతు అందించడం వంటిపై ఫోకస్ పెట్టనున్నారు. అంతేగాక వడదెబ్బ నిర్వహణ కోసం కింగ్ కోఠి, నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక హీట్-స్ట్రోక్ గదుల ఏర్పాటు చేయనున్నారు. సబ్-సెంటర్లలో 106, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 172 రకాల అత్యవసర మందుల లభ్యతను నిర్ధారించడం వంటివి చెక్ చేయనున్నారు. అంతేగాక 145 అర్బన్ పీహెచ్ సీలను పాలిక్లినిక్లుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా స్పెషలిస్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సికిల్ సెల్, థాలీసీమియా , హీమోఫీలియా వంటి వ్యాధుల గుర్తింపు , చికిత్స కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

టిమ్స్ ఓపెనింగ్ ..

Advertisement

టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించడం వంటివి కూడా ఈ ప్రోగ్రామ్ లో క్రోడీకరించారు. మార్చి 19న సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభించనున్నారు. ఇక జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా హెల్త్ రిపోర్ట్ కార్డ్స్ విడుదల చేయనున్నారు. జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా హాస్టళ్లు, పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. మరోవైపు ట్రైబల్ ఏరియాల్లోని హిమోఫిలియీ వంటి రేర్ డీసీజెస్ కంట్రోల్ చేయనున్నారు.

Also Read: Rajasthan Assembly: అసెంబ్లీలో ఆ మంత్రి తుపుక్ తుపుక్ అంటూ.. ఎంత పని చేశారు, విపక్షాల ఆరోపణలు

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×