E-Paper
Advertisement

TG Temple Lands: సరిహద్దుల్లో ఉన్న దేవాదాయ భూమి పై సర్కార్ కీలక నిర్ణయం.. వాటితో నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?

TG Temple Lands: సరిహద్దుల్లో ఉన్న దేవాదాయ భూమి పై సర్కార్ కీలక నిర్ణయం.. వాటితో నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?

TG Temple Lands: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న దేవాలయ భూములపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆ భూమి లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే టెండర్లు పిలిచి వాటిని లీజుకు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఆలయ భూములకు రక్షణ ఏర్పడుతుందని, శాఖకు సైతం ఆదాయం వస్తుందని భావించి అందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

6వేల ఎకరాల భూమి..

రాష్ట్రంలోని ఉన్న ప్రధాన ఆలయాల పరిధిలో మొత్తం 91,827 ఎకరాలు ఉన్నట్లు దేవాదాయశాఖ రికార్డుల్లో ఉంది. అందులో 25వేల ఎకరాలు కబ్జాకు గురికాగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నిమగ్నమైంది. మరో 6003.18 ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ 6వేల ఎకరాల భూమి కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో ఉన్నట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అయితే ఆ భూమిని లీజు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆభూమిని లీజుకు ఇస్తే దేవాదాయశాఖకు ఆదాయం వస్తుందని భావిస్తుంది. దీంతో ఆ ఆలయం అభివృద్ధి పనులు చేయవచ్చని అధికారులు సైతం భావిస్తున్నారు. అందుకు మంత్రి కొండా సురేఖ సైతం లీజుకు ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ భూముల లీజు ధర సైతం నిర్ణయించాలని, అందుకు నోటిఫికేషన్ సైతం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. ఈ 6వేల ఎకరాలను లీజుకు ఇస్తే భూమికి రక్షణ ఏర్పడుతుందని, అక్రమార్కుల నుంచి దానిని కాపాడుకోవచ్చని మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. లీజుకు ఇచ్చే సంస్థతో ఏయే నిబంధనలుపెట్టాలని, అగ్రిమెంట్ సమయంలో తీసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Also Read: Real Estate Fraud: రూ.210 కోట్ల అప్పుతో దేశం విడిచి జంప్ అయిన బడా రియల్టర్..!

ఆ 6వేల ఎకరాలు రాష్ట్ర సరిహద్దు కర్నాటక, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర,రాజస్థాన్ లోనూ ఆలయఉన్నట్లు దేవాదాయశాఖ రికార్డు..

1.నారాయణపేట జిల్లాలోని మగనూరు గ్రామం, నేరేడ్గం మండలంలోని సిద్దిలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమి 1137 ఎకరాలు ఉంది. ఈ భూమి కర్నాటక రాష్ట్రంలోని ఉన్నట్లు రికార్డులో ఉంది.
2.భద్రాద్రా కొత్తగూడెంలో జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి 1052.07 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఏపీలోని క్రిష్ణా, ప్రకాశం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కర్నూల్ జిల్లాలోని ఉంది.
3.జనగాం జిల్లాలోని జిడిషియల్ లింగాల ఘన్ పూర్ లోని రామచంద్రస్వామి ఆలయానికి 12.19 ఎకరాలు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొర్నెపాడు గ్రామం, వట్టిచెరుకు మండలంలో ఉన్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి.
4.వరంగల్ జిల్లాలోని వరంగల్ పట్టణ పరిధిలోని రంగసాయిపేట గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయానికి 8 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఏపీలోని క్రిష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉంది.
5.ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామచంద్ర గోపాల క్రిష్ణ మఠ్ కు 1280.38 ఎకరాలు ఉంది. ఈ భూమి మహారాష్ట్రలోని యెవాత్మల్ జిల్లాఖేలాపూర్ తలుకు మండలం గోష్మి గ్రామంలో ఉంది.
6.మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ (గద్వాల)లో గల బాల బ్రహ్మేశ్వరస్వామి అన్నదాన సత్రం కు 20.17 ఎకరాలు ఉండగా ఈ భూమి ఏపీలోని కర్నూల్ జిల్లాలోని జి.సింగవరం,కల్లూరులో ఉంది.
7.హైదరాబాద్ పరిధిలోని ఆసిప్ నగర్ లోని మల్లేపల్లిలో ఉన్న సీతారంభాగ్ సీతారామచంద్రస్వామి ఆలయం(సీతారాం మహరాజ్ సంస్థాన్)కు 2492.17 ఎకరాలు ఉంది. ఈ భూమిమహారాష్ట్రలోని అమరావతి, రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లో ఉన్నట్లు రికార్డులో ఉంది.

ఈ భూమికి ప్రస్తుతం లక్షల్లో ధర..

ఇది ఇలా ఉంటే భూమి గుర్తింపు అధికారులకు సవాల్ గా మారినట్లు సమాచారం. ఇప్పటివరకు దేవాదాయశాఖ అధికారులు వెళ్లి భూమిని పరిశీలించిన దాఖలాలు లేవనే ప్రచారం జరుగుతుంది. మరి ఆ 6వేల 3 ఎకరాల 18 గుంటల భూమి నాలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలోనే దేవాదాయశాఖకు చెందిన ఎక్కువ భూమి ఉన్నట్లు రికార్డులో ఉంది. దాదాపు 3709.55 ఎకరాల(రాజస్థాన్ తో కలిపి) భూమి ఉంది. ఆ తర్వాత కర్నాటకలో 1137 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ లో 1092.43 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమికి సరిహద్దులు నిర్ణయించలేదని సమాచారం. నక్ష, హద్దులు, సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ భూమికి ప్రస్తుతం లక్షల్లో ధర పలుకుతుంది. రికార్డుల్లో ఉన్న భూమిని ఇప్పటివరకు అధికారులు సర్వే చేయలేదని, అసలు ఆదిశగా అడుగులు వేయలేదని తెలిసింది. ఇప్పుడు ఈ భూమిని గుర్తించడం అధికారులకు ఇకసవాలే. ఆ భూమికిసర్వే నెంబర్లు సైతం స్పష్టం లేవని ప్రచారం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ భూములను ఎలా తిరిగి స్వాధీనం చేసుకుంటారు? ఎలా లీజుకు ఇస్తారనేది కూడా చర్చకుదారితీసింది. ఏది ఏకమైప్పటికీ ఈ భూములను గుర్తించి లీజుకు ఇస్తే మాత్రం సంబంధిత ఆలయాలు అభివృద్ధితో పాటు పనిచేసే ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Telangana: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం.. 745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×