E-Paper
Advertisement

Singareni Elections : సింగరేణిలో మోగిన జంగ్ సైరన్.. ప్రచారంలో పాల్గొన్న మంత్రులు..

Singareni Elections : సింగరేణిలో మోగిన జంగ్ సైరన్.. ప్రచారంలో పాల్గొన్న మంత్రులు..
Advertisement

Singareni Elections : సింగరేణిలో జంగ్ సైరన్ మోగిన నేపథ్యంలో తెలంగాణ మంత్రలు ప్రచారం మొదలుపెట్టారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ తరఫున ప్రచారం చేశారు.

సింగరేణిలో కార్మికుల వైద్యానికి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సభ్యులు ఐఎన్‌టీయూసీలో చేరారు. కారుణ్య నియామకాలను నిష్పక్షపాతంగా చేపడతామని మంత్రి పొంగులేటి తెలిపారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో మంత్రితో పాటు స్ధానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా పాల్గొన్నారు.

Advertisement

మరోవైపు పెద్దపల్లిలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఐఎన్‌టీయూసీ తరఫున శ్రీధర్‌బాబు ప్రచారం చేశారు. ఆర్‌జీ 3 పరిధిలోని ఏఎల్‌పీ, ఓసీపీ-1, ఓసీపీ-2 బొగ్గు గనుల్లో మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తామని హామి ఇచ్చారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని.. అందుకోసం ఒక హైపవర్ కమిటీ వేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×