BigTV English

Telangana Secretariat: నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా.. ఎందుకంటే?

Telangana Secretariat: నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా.. ఎందుకంటే?

Telangana Secretariat: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సచివాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో సచివాలయంను నిర్మిస్తున్నారు. తాజాగా సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సచివాలయానికి డా. బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న, ఇప్పటికే ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు కలిపి మొత్తం 13, తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×