TG ration cards : సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. ఎన్నో ఏళ్లుగా ప్రజల నుంచి డిమాండ్ ఉన్న రేషన్ కార్డు మంజూరుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజల నుంచి బలమైన డిమాండ్ ఉన్న రేషన్ కార్డుల విషయాన్ని సంక్రాంతి విధివిధానాలు ఖరారు చేసి.. విడుదల చేసింది. దీంతో.. వేల మందికి లబ్ధి చేకూరనుంది.
స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో మూడు కొత్త పథకాల్ని ప్రవేశపెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. మంత్రులు సైతం వారికి కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యాటిస్తూ.. పథకాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లోని ఆహార భద్రత (రేషన్) కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా సర్కారు ముందడుగు వేసినట్లయింది. రేషన్ కార్డుల జారీ, విధివిధానాలపై రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గం.. ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ విధానాలకు ఖరారు చేశారు. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారని తెలిపిన సర్కార్.. వాటి ఆధారంగా కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి, చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం ఇవ్వాలని సూచించింది. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులకు సైతం ఈ సారి అవకాశాలు కల్పించనున్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనున్నట్లు ఈ గైడ్ లైన్స్ సూచిస్తున్నాయి.