BigTV English

Japan : జపాన్ లో భారీ భూకంపం.. రికార్ట్ స్కేల్ పై 6.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు జారీ

Japan : జపాన్ లో భారీ భూకంపం.. రికార్ట్ స్కేల్ పై 6.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు జారీ

Japan : జపాన్లో భారీ భూకంపం సంభవించింది భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో దేశ నైరుతి ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు ఆ దేశ వాతావరణ ఏజెన్సీ తెలిపింది రిక్టార్ స్కేల్ పై 6.9 తీవ్రత తో భూకంపం నమోదు కావడంతో మియాజాకితో పాటు కొచీ ప్రాంతాలకు సునామీహెచ్చరికలు జారీ చేసింది.


జపాన్‌లో భారీ భూకంపం నమోదైనట్లు ఆ దేశ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో ఆ భూకంపం వచ్చిందని… 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశాలు ఉండటంతో తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ భూకంప తీవ్రతతో 30 నిమిషాల్లోనే ఒక మీటర్ ఎత్తైన అలలు తీరాన్ని తాకాయని జపాన్ మీడియా సంస్థ వెల్లడించింది. ఎంతవరకు నష్టం జరిగిందన్న విషయాలు ఇంకా తెలియనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేపట్టారు. ఇక ఈ భూకంప తీవ్రతతో మీయాజాకి స్టేషన్లో రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి


ఇక జపాన్లో ఎప్పటికప్పుడు భూకంపాలు సునామీలు వస్తూనే ఉన్నాయి. 2011 మార్చి 11న జపాన్లో సునామీ రావటంతో 20 వేల మందికి పైగా మరణించారు. ఇక గత ఏడాది సైతం రెండు భారీ భూకంపాలు వచ్చాయి. నైరుతి దీవులైన క్యుషు, షికోకులను ఈ భూకంపాలు కుదిపేశాయి. అప్పుడు కూడా అధికారులు పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×