E-Paper
Advertisement

తెలంగాణ ఆర్టీసీ‌లో సమ్మె సైరన్.. కేవలం 48 గంటలు మాత్రమే, మహాలక్షిలకు ఇబ్బందులు తప్పదా?

తెలంగాణ ఆర్టీసీ‌లో సమ్మె సైరన్.. కేవలం 48 గంటలు మాత్రమే, మహాలక్షిలకు ఇబ్బందులు తప్పదా?
Advertisement

TG RTC Strike Siren: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటకు రెడీ అయ్యారా? కేవలం మరో 48 గంటలు మాత్రమే ఉందా? సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్ధమయ్యారా? ప్రభుత్వం పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా? ఒకవేళ బంద్ జరిగితే రోజూ ప్రయాణిస్తున్న లక్షలాది మంది మహాలక్ష్మిలకు ఇబ్బందులు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ‌లో సమ్మె సైరన్.. కేవలం 48 గంటలు మాత్రమే

Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికుల సమ్మె సంకేతాలు తీవ్రమైనట్టు కనిపిస్తోంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు సమ్మెకు సిద్దమయ్యారు. ప్రభుత్వానికి కార్మికుల సంఘాలు ఇచ్చిన గడువుకు కేవలం 48 గంటలు మాత్రమే మిగిలివుంది.

అదే జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందన్న టెన్షన్ చాలామందిని వెంటాడుతోంది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రావాలన్నది ఆర్టీసీ జేఏసీ నేతల మాట. ప్రభుత్వంతో పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు.

Advertisement

సమ్మెపై చర్చించుకుంటున్న మహాలక్షిలు

దీంతో గతంలో ప్రకటించినట్టుగా సమ్మెకు వెళ్తామన్నది సంఘాల నేతల మాట. అయితే సోమవారం సాయంత్రం భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ జరగనుంది. ఆ సభలో ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని కొందరు ఆర్టీసీ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజారిటీ అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. రెండు మినహా అన్నింటిపై సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో జేఏసీ నేతలు తమ పట్టు వీడలేదు.

ALSO READ: హైదరాబాద్ గురించి షాకింగ్ న్యూస్.. కేవలం 23 శాతం మాత్రమే

తెలంగాణ ఆర్టీసీలో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం కింద ప్రతీ రోజూ దాదాపు 30 నుంచి 35 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకం మొదలైన నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఒకవేళ సమ్మె అనివార్యమైతే తమ పరిస్థితి ఏంటని అప్పుడు మహిళలు చర్చించుకోవడం కనిపిస్తోంది. బస్సులో మహిళలు దీనిపై చర్చించుకుంటున్నారు.

మరోవైపు సమ్మె వల్ల సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. సమ్మె జరిగితే ప్రైవేట్ వాహనాలను రంగంలోకి దించడం, తాత్కాలిక డ్రైవర్లను నియమించడం వంటి అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు సమాచారం.

 

Related News

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×