E-Paper
Advertisement

‘అద్దె’కు హైదరాబాద్.. కేవలం 23 శాతం మాత్రమేనా? సర్వేలో షాకింగ్ విషయాలు!

‘అద్దె’కు హైదరాబాద్.. కేవలం 23 శాతం మాత్రమేనా? సర్వేలో షాకింగ్ విషయాలు!
Advertisement

Hyderabad City:  తెలంగాణలో జనాభా పెరుగుతోందా? ఉద్యోగాలకు హైదరాబాద్‌కు వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతోందా? అత్యల్ప గృహ యాజమానుల రేటు నమోదు అయ్యిందా? భాగ్యనగరంలో కేవలం సొంత ఇంటికి కలిగినవారు నాలుగొంతుల్లో ఒక వంతు కూడా లేదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ సిటీ గురించి షాకింగ్ న్యూస్

Advertisement

తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల-SEEEPC సర్వే-2024లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం తెలంగాణలో సొంత ఇళ్లు ఉన్న కుటుంబాల వాటా హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో అత్యల్పంగా నమోదు అయ్యింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యల్ప గృహ యాజమాన్య రేటు ఉన్నట్లు తేలింది. కేవలం 23.08 శాతం కుటుంబాలు మాత్రమే సొంత ఇంటిని కలిగి ఉన్నాయని అందులోని సారాంశం. ఇక సమీప జిల్లాలు మేడ్చల్-మల్కాజిగిరిలో అయితే 35.26 శాతం, రంగారెడ్డి జిల్లాలో 35.56 శాతంతో రెండు, మూడు అత్యల్ప జిల్లాలుగా నమోదు అయ్యాయి.

Advertisement

కేవలం 23 శాతం మాత్రమే సొంత గృహాలు కలిగినవారు

హైదరాబాద్ సిటీకి విరుద్ధంగా మిగతా జిల్లాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో అత్యధికంగా 68.88 శాతం గృహ యాజమాన్యం ఉన్నారు. ఆ తర్వాత వనపర్తిలో 67.02 శాతం, జోగులాంబ గద్వాల్ జిల్లా‌లో 65.21 శాతం, నాగర్‌కర్నూల్‌లో 65.13 శాతం నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరిలో 64.86 శాతం ఉన్నట్లు తేలింది.

ఈ లెక్కన గృహ నిర్మాణాలు విషయంలో పట్టణ-గ్రామీణ ప్రాంతాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గృహ యాజమాన్యం సర్ వసాధారణం ఉంటాయి. కాకపోతే హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో అద్దె ఇళ్ల వైపు గణనీయమైన మార్పు కనిపిస్తోంది.

ALSO READ: మట్టిలో కలిసిన రైతన్న బంగారం.. రాళ్ల వానకు రాలిపోయిన గింజలు

మొత్తానికి సర్వే ప్రకారం హైదరాబాద్‌లో అత్యధికంగా 70.63 శాతం కుటుంబాలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత మెడ్చల్-మల్కాజిగిరి 60.91 శాతంతో ఉంది. రంగారెడ్డి 59.71 శాతంతో సరిపెట్టుకుంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల నివాసితుల్లో అధిక శాతం అద్దె ఇళ్లపై ఆధారపడుతున్నారు.

ఇతర జిల్లాల్లో అద్దె ఇళ్లలో నివసించేవారి సంఖ్య చాలా తక్కువ. ఇక నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 26.17 శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 26.35 శాతం, వనపర్తిలో 29.11 శాతం, నాగర్‌కర్నూలులో 29.45 శాతం, మహబూబాబాద్ జిల్లాలో 30.32 శాతం అద్దె ఇళ్లు ఉన్నాయి.

Related News

సూర్యపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు!

పోలీస్ పిల్లల చదువుపై నో టెన్షన్.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన నిర్ణయం!

హరీశ్ రావుపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: కవిత

22A భూముల బాధితులకు గుడ్ న్యూస్.. పరిష్కారంపై మంత్రి పొంగులేటి క్లారిటీ!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 14 నుంచి ఈ దారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

‘దసరాకి రికార్డింగ్ డ్యాన్సులకి పొండి’.. BRS ఎమ్మెల్యేలకు ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్!

అమీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, మహిళ దుర్మరణం!

మెట్‌పల్లిలో ఫ్రీగా కూల్ డ్రింక్స్ పంపిణీ.. అసలు స్టోరీ ఏంటంటే..?

Big Stories

Advertisement
×