కంప్లీట్ కేబినేట్ లిస్ట్ రిలీజయ్యేనా? లేక ఖాళీలుంటాయా? తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. ఉగాదికల్లా ఆరుగురు మంత్రులకు పదవులు ఖాయమనుకున్న ఆశావహుల ఆశలు.. ఒక్కసారిగా వాయిదా పడ్డాయి. ఏప్రిల్ మూడు అన్నారు కానీ అది కూడా సాధ్యం కాదంటున్నారు. అయితే ఎట్టకేలకు ఫస్ట్ వీక్ లో లిస్ట్ రిలీజ్ అవుతుందని మాత్రం చెప్పుకుంటున్నారు.
అయితే ఆరు బెర్తులకు గానూ ఐదింటి ఎంపిక పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరొక పదవిపై మాత్రమే ఇంకా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియ చేశారట. సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా ఎవరికిస్తే బావుంటుందో ఫుల్ క్లారిటీ ఇచ్చారట. కేబినెట్ విస్తరణలో ఇటీవల జరిగిన మీటింగే ఫైనల్ మీటింగ్ అన్న మాట కూడా వినిపిస్తోందట.
ఖరారైన వారిలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక వెంకట స్వామి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ముదిరాజ్ కోటాలో వాకిట శ్రీహరి. ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక మైనార్టీల నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ కాన్ కి ఛాన్స్ ఇచ్చేలా తెలుస్తోంది.
మిగిలిన ఒక బెర్తు కోసం ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు వినవస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం పోటీలో ఉన్నట్టు సమాచారం. ఇదంతా ఇలాగుంటే.. ST కోటాలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ ప్రాంతం నుంచి ఒక రెడ్డి నేతకు చీఫ్ విప్ ఇచ్చేలా తెలుస్తోంది. ఈ దిశగా పార్టీలో జోరుగా చర్చ సాగుతోందట.
Also Read: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి హౌస్ అరెస్ట్
అయితే ఎస్టీ కోటాలో కొందరు ఆశావహులు తమకు బెర్త్ ఖాయం అంటూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారట. తమకంటే తమకు ఛాన్సులివ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారట. వీరిలో ఎవరికి దక్కుతుందనే స్పష్టత రాకున్నా తమ ఆశలైతే పెంచుకుంటూ వస్తున్నారట.
మరి ఇప్పటికైనా కేబినేట్ కంప్లీట్ గా ఫుల్ ఫిల్ చేస్తారా? లేక ఏవైనా ఒకటి రెండు ఖాళీలతో కొత్త లిస్టు విడుదలవుతుందా? ఇంకా తేలాల్సి ఉందంటున్నారు. మొత్తంగా ఏప్రిల్ తొలివారానికల్లా.. కేబినేట్ విస్తరణ జరిగేనా? జరిగితే ఆరు పదవులనూ భర్తీ చేస్తారా? లేదా తేలాల్సి ఉందంటున్నారు.