Sunita Williams First Reaction : 9 నెలలు అంతరిక్షంలో ఉండి భూమిపైకి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్‌తో మిగిలిన వ్యోమగాములు ఎట్టకేలకు బయటకు వచ్చారు. తాము ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నామని సునీతా విలియమ్స్ చెప్పారు. అవకాశం వస్తే మళ్లీ స్టార్ లైనర్‌లో ISSకు వెళ్తామని అన్నారు. స్టార్‌లైనర్ చాలా సామర్థ్యం గల వాహకనౌక అని అన్నారు సునీతా. అయితే అందులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని.. వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీతా థాంక్స్ తెలిపారు. తాను భూమిపైకి వచ్చాక కొద్దిరోజులు కాళ్లు ఆగలేదని.. భూమిపై నిల్చోలేక పోయానని తెలిపారు. ఇప్పటికే మూడు మైళ్లు పరుగెత్తానని చెప్పారు. తాను మళ్లీ సాధారణంగా స్థితికి రావడానికి సహాయం చేసిన మెడికల్ సిబ్బందికి కూడా ఆమె థాంక్స్ చెప్పారు. గతంలో తాము తీసుకున్న ట్రైనింగ్ మమ్మల్ని అంతరిక్షానికి వెళ్లేలా చేసిందని అన్నారామె.
తాము మళ్లీ స్టార్‌లైనర్‌లోనే ఐఎస్‌ఎస్‌కు వెళ్తామని విల్మోర్ కూడా అన్నారు. బోయింగ్, నాసా సాయంతో స్టార్‌లైనర్‌లోని సమస్యలను క్లియర్ చేసుకుంటామని చెప్పారాయన. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని ఆశించారు విల్మోర్. తమకు నాసాపై ఎంతో నమ్మకముందని అన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా చెప్పుకొచ్చారాయన.
సునీత విలియమ్స్.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ. వ్యోమనౌకలో తలెత్తిన లోపాలతో.. ఆమె 9 నెలలుగా పైనే ఉండిపోయారు. గతేడాది జూన్ 5న సునీత అంతరిక్షంలోకి వెళ్లారు. తిరిగి అదే నెలలో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. కానీ.. అది జరగలేదు. సునీత స్పేస్‌లోకి వెళ్లి.. 280 రోజులు దాటింది. భూకక్ష్యకు సుమారు 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి.. సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌ని.. బోయింగ్ స్టార్‌లైనర్ విజయవంతంగా తీసుకెళ్లింది. వారిని అక్కడ దించేసిన తర్వాత.. అది పనిచేయడం మానేసింది.
Also Read: హాలిడే మెమోరీస్.. పిల్లలు, పేరెంట్స్‌కు మోదీ పిలుపు
నాసా టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన రిపేర్లు కూడా పనిచేయలేదు. అలా.. వారం రోజుల కోసం వెళ్లి.. నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్ అప్పటి నుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో వారు ఐఎస్‌ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు.
మొత్తానికి.. 9 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు తిరిగి వచ్చారు. వీరి స్థానంలో.. అక్కడ విధులు నిర్వర్తించేందుకు.. నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ స్పేస్ షిప్.. అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసీలోకి దూసుకెళ్లింది. క్రూ-10 మిషన్‌లో భాగంగా.. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్.. వీళ్లందరినీ నింగిలోకి మోసుకెళ్లింది.