BigTV English

Mega 157 Update : అనిల్ మంత్ర… సంక్రాంతికి చిరు మూవీ రఫ్ఫాడిపోతుంది అంతే…

Mega 157 Update : అనిల్ మంత్ర… సంక్రాంతికి చిరు మూవీ రఫ్ఫాడిపోతుంది అంతే…

Mega 157 Update : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తన 157 వ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.. తెలుగు వారి నూతన సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా ఉగాది నాడు అనగా మార్చి 30వ తేదీన చాలా ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడంతో సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ముఖ్యంగా ఒక సినిమాకి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు అంటేనే అంచనాలు భారీ లెవెల్లో ఉంటాయి. అలాంటిది వింటేజ్ చిరుని చూపిస్తానని, మెగాస్టార్ చిరులోని కామెడీ యాంగిల్ ను నా స్టైల్ లో చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పవచ్చు. దీనికి తోడు చిరంజీవి వింటేజ్ మూవీలకు సంబంధించిన విషయాలను కలగలుపుతూ.. ఈ చిత్రానికి ఏ విభాగంలో ఎవరు పనిచేస్తున్నారు.. అనే విషయంపై క్లారిటీ ఇస్తూ.. అనిల్ రావిపూడి ఇచ్చిన అప్డేట్ సినిమాపై ఊహించని విజయాలను పెంచేసింది.


Venu Swamy:వేణు స్వామి పాత్రలో స్టార్ నటుడు… ఆయన రియాక్షన్ ఏంటో మరి..?

మెగా 157 నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..


2026 సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ చిత్ర బృందంతో సరికొత్త జోష్ తో కనిపించారు అనిల్ రావిపూడి. ఇక అనిల్ రావిపూడి విడుదల చేసిన అప్డేట్ విషయానికి వస్తే..ఈ సినిమా కోసం ఏ విభాగానికి ఎవరు పనిచేస్తున్నారు అనే విషయాన్ని రివీల్ చేశారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

మెగా 157 టెక్నీషియన్స్ వీరే..

ముఖ్యంగా ఈ చిత్రానికి డైరెక్షన్ బాయ్స్ తో పాటు అడిషనల్ డైలాగ్ రైటర్స్ ని కూడా రంగంలోకి దింపారు అనిల్ రావిపూడి. ఇక ఈ చిత్రానికి కో రైటర్ గా నారాయణ , కో రైటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సాయి కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ ఎస్. ప్రకాష్ , ఎడిటర్ తమ్మిరాజు, డిఓపిగా సమీర్ రెడ్డి తో పాటు పలువురు ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు. మొత్తానికైతే ఈ సినిమా కోసం అందరిని ఏరి కోరి మరీ తీసుకొచ్చిన అనిల్ రావిపూడి మెగాస్టార్ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందివ్వాలని ఫిక్స్ అయిపోయారు. మరి సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

చిరంజీవి సినిమాలు..

ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈయన.. ఆ తర్వాత వచ్చిన ‘భోళాశంకర్’ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తర్వాత విశ్వంభర సినిమా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి పూర్తి అప్డేట్ బయటకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కోసం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన టీం తో రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇక మొత్తానికైతే సమ్మర్లో విశ్వంభరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×